Bigg Boss 5 Telugu: ఆగస్టు 15న సర్ప్రైజ్.. 22 నుంచి క్వారంటైన్లోకి కంటెస్టెంట్స్..!
Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ షో అభిమానులకు శుభవార్త. తెలుగు బిగ్ బాస్ ఐదో సీజన్ కు సంబంధించిన ప్రోమోను ఆగస్ట్ 15న విడుదల చేయబోతున్నట్లు సమాచారం.
Bigg Boss 5 Telugu: తెలుగు బిగ్‌బాస్ ఐదో సీజన్ సందడి షురూ అయ్యింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానుల ఎదురుచూపులకు త్వరలో తెరపడనుంది.
ఈ సంవత్సరం షో ఉంటుందా లేదా అనే ఊహాగానాలకు చెక్ పెడుతూ నిర్వాహకులు ప్రోమో వదిలిస సంగతి తెలిసిందే. తాజాగా మరో సర్‌ప్రైజ్‌కు ప్లాన్ చేస్తున్నారట. స్వాతంత్య్ర దినోత్సవం(Independence Day) సందర్భంగా ఆగస్ట్ 15న మరో ప్రోమో విడుదల చేయబోతున్నట్లు సమాచారం.
ఈ ప్రోమో షూటింగ్ ఇప్పటికే పూర్తి అయినట్లు తెలుస్తోంది. అంతేకాదు షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎంపిక కూడా ఫైనల్ చేశారట. ఆగస్ట్ 22 నుంచి వారికి క్వారంటైన్‌కు తరలించనున్నట్లు సమాచారం. అక్కడ 15 రోజుల పాటు క్వారంటైన్ చేసి, సెప్టెంబర్ 5న నేరుగా బిగ్‌బాస్(Bigg Boss) హౌస్‌లోకి పంపుతారట. ప్రతి కంటెస్టెంట్‌కి రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతే బిగ్‌బాస్ హౌస్‌లోకి అనుమతించనున్నారు.
Also Read: Bigg Boss 5 Telugu:హాట్ టాఫిక్ గా యూట్యాబ్ స్టార్ రెమ్యూనరేషన్ ..ఎంతో తెలుసా?
కంటెస్టెంట్లుకు సంబంధించిన ఓ లిస్ట్ సోషల్ మీడియా(Social Media)లో చక్కర్లు కొడుతోంది. అందులో యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్, యాంకర్ రవి, నటి ప్రియా, ట్రాన్స్‌జెండర్ ప్రియాంక, యాంకర్ వర్షిణి, యానీ మాస్టర్, కార్తీక దీపం భాగ్య అలియాస్ ఉమ, నటి లహరి, నవ్వస్వామి, యూట్యూబర్ నిఖిల్, వీజే సన్నీ, ఆర్జే కాజల్, లోబో, సిరి హన్మంత్, ఆట సందీప్ భార్య జ్యోతి, శ్వేతల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో కొందరి పేర్లు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఈసారి కూడా హోస్ట్‌గా నాగార్జున(Nagarjuna)నే వ్యవహరించనున్నారు.
తెలుగులో బిగ్‌బాస్ నాలుగు సీజన్లు పూర్తి చేసుకుని..ఐదో సీజన్ లోకి అడుగుపెడుతోంది. బిగ్‌బాస్ సీజన్ నాల్గో సీజన్‌లో అభిజిత్(Abijith) విజేతగా నిలిచాడు. తెలుగులో ఫస్ట్ టైమ్ ఎన్టీఆర్(NTR) ఈ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత సెకండ్ సీజన్‌కు నేచురల్ స్టార్ నాని(Nani) హోస్ట్‌గా ఉన్నారు. ఇక మూడో, నాలుగు సీజన్స్‌కు మాత్రం కింగ్ నాగార్జున(Nagarjuna) హోస్ట్‌గా చేశారు.
Also Read: బిగ్ బాస్ తెలుగు 5: బిగ్ బాస్ కంటెస్టంట్స్ జాబితాలో యాంకర్ రవి ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook