బిగ్ బాస్ తెలుగు 5: బిగ్ బాస్ కంటెస్టంట్స్ జాబితాలో యాంకర్ రవి ?

Anchor Ravi in Bigg Boss Telugu 5 reality show: యాంకర్ రవి. తెలుగు బుల్లితెరపై పరిచయం అవసరం లేని పేరు. అందుకే యాంకర్ రవిని బిగ్ బాస్ షోలోకి తీసుకున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. బిగ్ బాస్ తెలుగు 5 రియాలిటీ షో కంటెస్టంట్స్ జాబితాలో యాంకర్ రవి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 5, 2021, 03:55 PM IST
బిగ్ బాస్ తెలుగు 5: బిగ్ బాస్ కంటెస్టంట్స్ జాబితాలో యాంకర్ రవి ?

Anchor Ravi in Bigg Boss Telugu 5 reality show: యాంకర్ రవి. తెలుగు బుల్లితెరపై పరిచయం అవసరం లేని పేరు. అందుకే యాంకర్ రవిని బిగ్ బాస్ షోలోకి తీసుకున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. బిగ్ బాస్ తెలుగు 5 రియాలిటీ షో కంటెస్టంట్స్ జాబితాలో యాంకర్ రవి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం యాంకర్ రవి, యాంకర్ అశు రెడ్డితో (Anchor Ashu Reddy) కలిసి హ్యాపీ డేస్ అనే టీవీ షో చేస్తున్నాడు. అంతేకాకుండా ఆషాఢంలో అత్తా కోడళ్లు అనే మరో షోకు సైతం హోస్టింగ్ చేస్తున్నాడు.

బిగ్ బాస్ 5 తెలుగు (Bigg Boss Telugu 5) రియాలిటీ షోలో పాల్గొనడం కోసమే యాంకర్ రవి కొత్తగా ఎలాంటి టీవీ షోలకు సైన్ చేయడం లేదని బుల్లితెర వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ టాక్‌పై యాంకర్ రవి ఏమని స్పందిస్తాడోననేదే ప్రస్తుతానికి వేచిచూడాల్సిన అంశం అంటున్నారు బుల్లితెర ఆడియెన్స్.

Also read : యోయో హనీ సింగ్‌ సీక్రెట్ ఎఫైర్స్‌, మ్యారేజ్‌, అతడి లైంగిక వాంఛలపై సంచలన విషయాలు వెల్లడించిన భార్య

అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni) మరోసారి బిగ్ బాస్ రియాలిటీ షోకు హోస్ట్‌గా రానున్నాడు. ఇటీవలే బిగ్ బాస్ తెలుగు 5 రియాలిటీ షో ప్రోమో (Bigg Boss Telugu 5 promo) కోసం షూటింగ్ కూడా జరిగింది. టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ టీజర్‌ను డైరెక్ట్ చేశాడు.

Also read : చిరు ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఆచార్య మూవీ లేటెస్ట్ అప్‌డేట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News