Bigg Boss 5 winner VJ Sunny and Diamond Ratna Babu new film unstoppable pooja ceremony: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 విజేత వీజే సన్నీ కొత్త సినిమా ఆరంభం అయింది. 'అన్ స్టాపబుల్' చిత్రం పూజా కార్యక్రమం మంగళవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్, దర్శకుడు బి గోపాల్, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, హీరో తనీష్ తదితరులు పాల్గొన్నారు. 'బుర్రకథ' సినిమాతో దర్శకుడిగా మారిన రచయిత డైమండ్ రత్నబాబు 'అన్ స్టాపబుల్' సినిమాను తెరకెక్కిస్తున్నారు. అన్‌స్టాపబుల్‌ (నో డౌట్ 100% ఎంటర్టైన్మెంట్), ఏ 2 బి ఇండియా ప్రొడక్షన్స్ ప్రవేట్ లిమిటెడ్ బ్యానర్‌లో రంజిత్ రావ్.బి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రచయిత విజయేంద్ర ప్రసాద్ హీరో వీజే సన్నీపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. దర్శకుడు గోపాల్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయులు సమావేశంలో సన్నీ మాట్లాడుతూ... 'దర్శకుడు డైమండ్ రత్నబాబు చెప్పిన కథ బాగా నచ్చింది. బిగ్ బాస్ తర్వాత నటుడుగా నేను ప్రూవ్ చేసుకోవాలని వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోకూడనుకున్నా. ప్రేక్షకులను మెప్పించడానికి, నవ్వించడానికి నటుడుగా నేను వందశాతం కష్టపడి పని చేస్తా. ఫలితం మాత్రం ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది. ఈ సినిమా అందరికి నచ్చుతుంది' అని అన్నాడు.


దర్శకుడు డైమండ్ రత్నబాబు మాట్లాడుతూ... 'అన్‌స్టాపబుల్‌ అనే టైటిల్ బాలయ్య బాబుది. తన టైటిల్ తో వస్తున్న మాకు బాలయ్య బాబు ఫ్యాన్స్ మద్దతు కూడా ఉంటుందని ఆశిస్తున్నా. నిర్మాతలు బాగుండాలి అని కోరుకునే సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ప్రారంభించాం. కృష్ణ, మహేష్ బాబు అభిమానులకు ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని అంకితం చేస్తున్నాం. జూన్ 9 నుంచి రెగ్యులర్ షూటింగ్ ఆరంభం అవుతుంది. జూన్, జులై నెలల్లో షూటింగ్ పూర్తి చేసుకొని దసరాకు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం' అని చెప్పారు.


సీమశాస్త్రి, పాండవులు పాండవులు తుమ్మెద, పిల్లా నువ్వు లేని జీవితం, ఈడోరకం ఆడోరకం చిత్రాలకు డైమండ్ రత్నబాబు సంభాషణలు అందించిన విషయం తెలిసిందే. బుర్రకథతో దర్శకుడిగా మారిన రత్నబాబుకు ఇది రెండో సినిమా. ఈ సినిమాకి భీమ్స్  సంగీతం అందిస్తున్నారు. సప్తగిరి, పోసాని కృష్ణమురళి, పృధ్వీ, మణి చందన, షకలక శంకర్, చమ్మక్ చంద్ర, బిత్తిరి సత్తి, గబ్బర్ సింగ్ బ్యాచ్ తదితరులు ఈ సినిమాలో నటించనున్నారు.


Also Read: Sonali Bendre: ఎన్టీఆర్‌ చిత్రంలో సోనాలి బింద్రే.. అసలు విషయం చెప్పేసిన హీరోయిన్‌!


Also Read: Sachin Tendulkar Playing XI: ధోనీ, రోహిత్, కోహ్లీ లేరు.. సచిన్ ఐపీఎల్ 2022 జట్టు ఇదే!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook