Maha Kumbh Mela Pregnant Women Holi Dip 14

  • Jan 29, 2025, 11:11 AM IST
1 /8

మహా కుంభమేళాకు కోట్లాది సంఖ్యలో ప్రజలు తరలి వెళ్తున్నారు. అక్కడ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అయితే గర్భిణీలు మహా కుంభమేళాకు వెళ్లవచ్చా.. అక్కడ నదీ స్నానం చేయవచ్చా అనేది సందేహాంగా ఉంది.

2 /8

వాస్తవంగా మహిళలు నదుల వద్దకు వెళ్లకూడదని అని చెబుతారు. గర్భిణీలు నదీ ప్రాంతాలకు వెళ్లవద్దనడానికి కొన్ని శాస్త్రీయమైనవి, మరికొన్ని మత విశ్వాసాల ఆధారంగా ఉన్నాయి.

3 /8

నదుల నీరు కలుషితమై ఉండే అవకాశం ఉంది. ఆ నీటిలో ఉండే బ్యాక్టీరియా, వైరస్‌లు వంటి సూక్ష్మజీవులు గర్భిణీలకు సోకవచ్చు. నదీ స్నానం చేస్తే గర్భిణీలకు అంటువ్యాధులు సోకే ప్రమాదం పొంచి ఉంది.

4 /8

మహా కుంభమేళాలో కోట్ల సంఖ్యలో భక్తులు ఉండడంతో గర్భం దాల్చిన మహిళలు ఇబ్బందులు పడవచ్చు. అక్కడకు వెళ్లడం ప్రమాదకరంగా మారింది. గర్భంలో ఉన్న శిశువుకు కూడా హాని జరగవచ్చు.

5 /8

నదుల వద్ద తేమ ఎక్కువగా ఉంటుంది. చలికాలంలో నదుల వద్దకు వెళ్లడం వల్ల గర్భిణీకు జలుబు, దగ్గు వంటివి సోకే అవకాశం ఉంది. 

6 /8

అంతేకాకుండా నదుల వద్దకు వెళ్తే అక్కడ జారిపడడం, నీటిలో మునిగిపోవడం వంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. గర్భిణీలు సున్నితంగా ఉండటం వల్ల పలు ప్రమాదాలు పొంచి ఉన్నాయి.

7 /8

ఆధ్యాత్మికపరంగా గర్భిణీలు నదుల వద్దకు వెళ్లకూడదనే కొన్ని కథనాలు ఉన్నాయి. గర్భిణీలు శుద్ధంగా ఉండాలని నదుల వద్దకు వెళ్లనివ్వరాదు. కొన్ని ప్రాంతాలలో నదులను ప్రేతాల నివాసంగా భావిస్తారు. నదుల వద్దకు వెళ్తే గర్భిణీలు ప్రేతాల ప్రభావానికి గురయ్యే అవకాశం ఉందని భావించి వారిని నదుల వద్దకు పంపించరు.

8 /8

గర్భిణీలు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. గర్భంతో ఉన్న సమయంలో సాధారణంగా ఎలాంటి దూర ప్రాంతాలకు వెళ్లరాదు. ముఖ్యంగా ప్రయాణాలు సాధ్యమైనంత చేయరాదు. ఈ నేపథ్యంలో మహా కుంభమేళాకు కూడా వెళ్లరాదు. వైద్యుల సలహాతో ప్రయాణాలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x