Bigg Boss 6 Telugu 7th Week Nomination List : బిగ్ బాస్ ఇంట్లో ఏడోవారం ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు ఆరువారాలు సక్సెస్ ఫుల్ కాగా.. ఆరుగురు ఇంటి సభ్యులు ఎలిమినేట్ అయ్యారు. షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీప వంటి వారు ఎలిమినేట్ అయ్యారు. ఇక ఇప్పుడు ఏడో వారానికి సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియలో మాటలు కోటలు దాడుతున్నాయి. కొందరు వింత చేష్టలు చేస్తూ.. ఎదుటివాళ్లను ఎగతాళి చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ ఏడో వారం నామినేషన్ ప్రక్రియలో మాత్రం రేవంత్ బలైనట్టు కనిపిస్తోంది. ఆరోవారంలో ఇంటి కెప్టెన్ అయిన రేవంత్.. పదే పదే పడుకోవడం, అతని వల్ల పది శాతం బ్యాటరీ తగ్గిపోవడంతో అందరూ అదే కారణంతో నామినేట్ చేసినట్టు కనిపిస్తోంది. దీంతో రేవంత్ బాగానే హర్ట్ అయినట్టున్నాడు. నామినేట్ చేయడానికి మీకు మరో కారణం లేదని అర్థమైందంటూ రేవంత్ అందరి మీద కౌంటర్లు వేశాడు.


 



ఇక ఇనయ, శ్రీహాన్ మధ్య ఎప్పటిలానే డిస్కషన్ జరిగింది. నీ బిహేవియర్ నాకు నచ్చలేదని ఇనయ గురించి శ్రీహాన్ చెబుతూ.. హేళన చేశాడు. అర్జున్ ఆదిరెడ్డి మధ్య కూడా డిస్కషన్ జరిగింది. నువ్ తక్కువ ఎంటర్టైన్ చేశావ్ అంటే.. నువ్ తక్కువ చేశావ్ అని ఆదిరెడ్డి అర్జున్ అనుకున్నారు. నువ్ నాలా స్టెప్పులు వేశావా? అని ఆదిరెడ్డి కౌంటర్లు వేశాడు. నువ్ ఈ ఇంటికి ఫిట్ కావు.. నువ్ వెళ్లిపోవాలని నామినేట్ చేస్తున్నా అని గీతూ అనేసింది. దీంతో హర్టైన బాలాదిత్య.. నీతో మాట్లాడటానికి ఏం లేదు అని చెప్పేసి వెళ్లిపోయాడు.


ఇంట్లో కన్‌ఫెషన్ రూంలోకి నాగార్జున గారు పిలిచి చెప్పినప్పుడు బాధ పడలేదు కానీ.. ఇప్పుడు మీ మాటలకు బాధపడుతున్నా అని బాలాదిత్య ఎమోషనల్ అయ్యాడు.ఇలా పదే పదే బాలాదిత్యను తన మాటలతో బాధపెడుతుంటుంది గీతూ. నిన్న సైతం.. ఇక మనం మాట్లాడుకోకుండా ఉంటే బెటర్ అని అసందర్భంగా గీతూ అనేసింది. దానికి సైతం బాలాదిత్య హర్ట్ అయ్యాడు.


ఈ ఏడో వారంలో అర్జున్, రేవంత్, సత్య, ఆదిత్య, ఇనయ, ఫైమా, రాజ్, ఆదిరెడ్డి, కీర్తి, రోహిత్, మెరినా, శ్రీహాన్, వాసంతి ఇలా పదమూడు మంది నామినేట్ అయ్యారు. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.


Also Read : Kantara Film Tollywood: కాంతార సినిమాను తెలుగోళ్లు చేసుంటే హిట్ అయ్యేదా?


Also Read : Hansika Motwani Marriage : సైలెంట్‌గా హన్సిక పెళ్లి ఏర్పాట్లు.. వేదిక ఎక్కడంటే?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook