Nagarjuna Fires on Geetu :  నాగార్జున మొదటి సారిగా గీతూని తిట్టాడు. ఇన్ని వారాల్లో గీతూ ఏం చేసినా కూడా మెచ్చుకున్నాడు. ఆహా ఓహో అంటూ కీర్తించాడు. గీతూ ది బెస్ట్ అన్నట్టుగా సర్టిఫికేషన్ ఇచ్చాడు. కానీ ఆ గీతూ ఎంత తలతిక్కదో తెలుసుకోలేకపోయాడు. ఆమెకు బిగ్ బాస్ అన్నా కూడా.. నాగార్జున అన్నా కూడా లెక్కలేదని తెలిసిందే. ఆమెకు ఏ రూల్ ఇచ్చినా పాటించదు. తనకు తానే బిగ్ బాస్ అన్నట్టుగా భ్రమలో బతికేస్తుంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆమె తన భుజం మీద ఈ బిగ్ బాస్ ఆరో సీజన్‌ను మోస్తున్నట్టుగా ఊహాలోకంలో ఉంటుంది. ఇక ఆమె చేసే అతిని జనాలు భరించడం లేదు. కానీ ఇంకా ఇంట్లోనే ఉంచుతున్నాడు బిగ్ బాస్. ఇలాంటి పిచ్చి, వింత కారెక్టర్ కూడా బిగ్ బాస్ ఇంటికి అవసరమే అని అనుకున్నాడో ఏమో గానీ గీతూ మాత్రం ఇప్పట్లో ఎలిమినేట్ అవ్వదు. చేయరు. అయితే ఈ వారం మాత్రం ది వరెస్ట్ గేమ్ ఆడేసింది గీతూ. తాను గెలవడం కోసం కాకుండా.. పక్కన వారి వీక్ నెస్ మీద కొట్టడంలోనే ఎక్కువగా దృష్టి పెట్టేసింది గీతూ.


 



ఇక సంచాలక్‌గా ఉండమంటే గేమ్ ఆడింది. సంచాలక్ ఆడకూడదని చెబితే.. నేను ఆడే సంచాలక్‌ అని, అందరితో నేను గేమ్ ఆడిస్తాను అంటూ ప్రగల్భాలు పలికింది. అయితే ఈ విషయాలన్నీ కూడా నాగార్జున వీకెండ్ ఎపిసోడ్‌లో లేవనెత్తినట్టున్నాడు. ఈ మేరకు వదిలిన ప్రోమో ఓ రేంజ్లో వైరల్ అవుతోంది. ఇందులో గీతూని నీ బొచ్చులో గేమ్ అని అనేశాడు.ఆమెను అందరి ముందు నిలబెట్టేసి మరీ పరువుతీశాడు. ఫిజికల్ గేమ్ ఇస్తే గుద్ది పారేస్తా అని అన్నావ్.. ఇదేనా నీ ఆట అంటూ పరువుతీశాడు.


సంచాలక్‌గా ఉండమంటే ఆట ఆడావ్.. సంచాలక్ అంటే ఎంపైర్ అంటూ గుర్తు చేశాడు నాగ్. బొచ్చులో అని ప్రతీసారి గీతూ మాట్లాడుతుంటుంది. అందుకే ఆమె మాటను ఆమెకు తిప్పి కొట్టాడు. బొచ్చులో ఆట అని అంటే ఎలా ఉందంటూ చురకలు అంటించాడు. నువ్ శిక్షకు అర్హురాలివే అంటూ నాగార్జున గరం అయ్యాడు. మరి ఆమెకు ఏ శిక్ష విధిస్తాడో చూడాలి. మొత్తానికి గీతూని ఇలా ఫ్రై చేయడంతో జనాలు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ది బెస్ట్ ప్రోమో అంటూ పొగిడేస్తున్నారు.


Also Read : Adireddy - Galata Geetu : ట్రాక్ తప్పిన గీతూ.. హెచ్చరించిన ఆదిరెడ్డి.. అతి మాత్రం తగ్గడం లేదుగా


Also Read : Samantha Ruth Prabhu Diseases : ఆస్పత్రి బెడ్డు మీద సమంత.. ఆ వ్యాధితో బాధపడుతోందట.. నోరు విప్పిన సామ్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook