Baladiya Galata Geetu : బిగ్ బాస్ ఇంట్లో బాలాదిత్య, గలాట గీతూలది టిపికల్ కారెక్టర్. ఒకరు మంచికి నిదర్శనంగా ఉంటే.. ఇంకొకరు కంత్రికి నిదర్శనంగా ఉంటారు. మంచి మాటలు, మంచితనం ఒకరు చూపిస్తే.. మొండితనం, పిచ్చిదనం చూపిస్తూ ఇంకొకరు ముందుకు సాగుతుంది. బాలాదిత్య, గీతూలు ఇలా భిన్న మనస్తత్వాలున్నా కూడా.. కలిసి మెలిసి ఉంటారు. అన్నా అంటూ బాలాదిత్యతో గీతూ ఉంటుంది. నేను నీ అంత మంచిదాన్ని కాదు.. నీలా నేను ఉండలేను.. బయట కూడా నేను నీలా ఉండలేను అని గీతూ చెబుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక బాలాదిత్య యోగాగురువుగా, ప్రవచన కర్తగా బిగ్ బాస్ ఇంట్లో మంచి పేరుని తెచ్చుకున్నాడు. ఒక్కోసారి అతి మంచితనం కూడా బెడిసి కొడుతుంది. అలా బాలాదిత్యకు తన మంచి తనమే శత్రువుగా అయ్యేలా ఉంది. మామూలుగా అయితే బిగ్ బాస్ ఇంట్లో ఆదిత్యకు ఏకగ్రీవంగానే సొంతమవుతుంది. కానీ నేటి కెప్టెన్సీ టాస్కులో బాలాదిత్య, సూర్య, రేవంత్ ఉన్నారు. ఇంటి సభ్యుల మెజార్టీ ఓటింగ్‌తో రేవంత్ కెప్టెన్ అయినట్టు తెలుస్తోంది.


ఈ టాస్క్ తరువాత హయర్ ఫ్రిడ్జ్‌కు సంబంధించిన టాస్క్ ఒకటి పెట్టినట్టున్నారు. ఇందులో రేవంత్ సంచాలకుడిగా వ్యవహరించాడు. అయితే సంచాలక్ నిర్ణయాల పట్ల చంటి వ్యతిరేకించినట్టు కనిపిస్తోంది. బాలాదిత్య ఏదో సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు.


 



ఇంతలో గలాట గీతూ ఏదో అనకూడని మాట అనేసినట్టుంది. చదువుకు సంబంధించిన విషయాన్ని లేవనెత్తినట్టుంది. దీంతో బాలాదిత్యకు చిర్రెత్తుకొచ్చింది. తప్పు తప్పు.. ఆ మాట మాట్లాడొద్దు అని గీతూకి వార్నింగ్ ఇచ్చాడు. గీతూ ఏదో చెప్పబోతోంటో కూడా బాలాదిత్య వినిపించుకోలేదు. ఎన్ని సార్లు పడాలి.. ప్రతీ సారి ఇలానే ఏదో ఒకటి అంటున్నావ్.. అంటూ బాలాదిత్య అరిచేశాడు.


అసలే బాలాదిత్య వల్ల గత వారం గీతూ కంటతడి పెట్టేసుకుంది. ఆ కోపమే ఇంకా పోనట్టుంది. మళ్లీ ఇప్పుడు గీతూ మీదే బాలాదిత్య అరిచేశాడు. మరి ఈ గొడవ ఇంకెంతకు దారి తీస్తుందో చూడాలి. ఆదిత్యకు కోపం రావడం, గీతూ ఏడ్వడం ఆశ్చర్యం కలిగించిందని నాగార్జున అన్నాడు. మరి ఈ వారం కూడా అదే సీన్ రిపీట్ అవుతుందా? అన్నది చూడాలి.


Also Read : మెగా ఫాన్స్ ఆగ్రహం.. చిరంజీవితో మాట్లాడతా, అందరికీ చెప్పండి..లైవ్లోనే గరికపాటి!


Also Read : Dhanush - Aishwarya : మళ్లీ ఒక్కటవ్వబోతోన్న ఐశ్వర్య - ధనుష్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook