Bigg Boss Galata Geetu : బిగ్ బాస్ ఇంట్లో గలాట గీతూ ఓవర్‌ యాక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తను ఒక్కత్తే గేమ్ ఆడుతుందనే భ్రమలో బతికేస్తోంది. తనంతటి గేమర్, తనంతటి తోపు కంటెస్టెంట్ ఎవ్వరూ లేరని అనుకుంటూ ఉంటుంది. గురువింద గింజకు తన కింద ఉండే నలుపు తెలీదన్నట్టుగా.. గీతూ తనలోని లోపాలను గుర్తించలేదు. గుర్తించినా ఒప్పుకోదు. ఒప్పుకున్నా మారదు. మారేందుకు ప్రయత్నించదు. నేను ఇంతే అన్న టైపులో ఉంటుంది. కానీ మిగతా వాళ్లను మాత్రం వేలెత్తి చూపుతుంది. మొదటి నుంచి గీతూ చేసేది అదే. కానీ ఆమె ఆట తీరు బాగుందంటూ నాగార్జున మొదటి నుంచి ఆమెను నెత్తిన పెట్టుకుంటూ వచ్చాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దాంతో గీతూ సైతం తెగ రెచ్చిపోయేది. బిగ్ బాస్ టీంకే ఆటలు ఆడిపించడం రావడం లేదు, సరైన టాస్కులు పెట్టడం లేదు, ఫిజికల్ టాస్కులు ఇవ్వండి గుద్ది పాడేస్తా అంటూ ఇలా ఎక్స్ ట్రా మాటలు మాట్లాడుతూ ఉంటుంది. నేను ఉండే సీజన్ ఎలా ఉండాలి అంటూ తనకు తాను ప్రగల్భాలు పలికేది. గీతూ ఓవర్ యాక్షన్ ఇన్నాళ్లు ఇంట్లోని కంటెస్టెంట్లు, చూసే ఆడియెన్స్ భరిస్తూనే ఉన్నారు. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో నాగార్జున పీకిన క్లాస్‌తో అందరికీ కాస్త మనశ్శాంతి, ప్రశాంతత చేకూరాయి.


నిన్నటి ఎపిసోడ్‌లో కాస్త గీతూ నోర్మూసుకుని కూర్చుంది. బొచ్చులో ఆట అంటూ గీతూ పరువుతీశాడు నాగార్జున. ఆట ఆడటం కూడా రాదని అన్నాడు. నువ్వెవరు ఆడించేందుకు.. బిగ్ బాస్ టీం ఉంది.. నీ ఆట నువ్ సరిగ్గా ఆడు.. ఎవరి ఆట వాళ్లు ఆడితే.. సీజన్ ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటుంది అని గీతూని నిలబెట్టి ఉతికేశాడు. అయితే గీతూ ఈ క్రమంలో కొన్ని మాటలు అనేసింది. తనకు టాస్కులో ఓడిపోతే తీసుకోలేను, తట్టుకోలేను అని అనేసింది. అదే రేవంత్ విషయంలో దాన్ని ఓ తప్పులా చెప్పింది.


ఇక తాను ఉన్న సీజన్ ఎలా ఉండాలి? అనే ఉద్దేశ్యంలో అందరితో ఆడించాలని అలా రెచ్చగొట్టానని చెప్పుకొచ్చింది. ఇదిగో ఇలాంటి ఎక్స్ ట్రా మాటలకే ఆడియెన్స్ ఇంకా కాలుతుంది. బిగ్ బాస్ టీంకు కూడా బాగానే కాలినట్టుంది. అందుకే నాగార్జునతో బాగా తిట్టించారు. నీ ఆట నువ్వు ఆడుకో.. ఎలా ఆడించాలనేది బిగ్ బాస్ టీం చూసుకుంటుందని చురకలు అంటించాడు.మరి ఇప్పటికైనా ఇలాంటివి తగ్గించుకుంటుందా? లేదా? అన్నది చూడాలి. కానీ గీతూ మాత్రం కుక్క తోక వంకర అన్నట్టుగా మళ్లీ తన పాత పద్దతిలోనే వెళ్లేట్టు కనిపిస్తోంది. గీతూ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విన్నర్ అయ్యే చాన్స్ లేదని నిన్నటి ఎపిసోడ్‌తో తేలిపోయింది.

Also Read : Pelli Fame Prudhvi : ప్రతీరోజూ పడక సుఖం కావాలంట!.. 56 ఏళ్ల వయసులో 'పెళ్లి' పృథ్వీ కామెంట్స్.. వామ్మో మామూలోడు కాదు


Also Read :Bigg Boss Shrihan : విన్నర్ అయ్యే అర్హత లేనిది అందుకే.. బొక్క బోర్లా పడ్డ శ్రీహాన్.. ఇక కష్టమేనా?  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook