Bigg Boss 7 Telugu 3rd week Elimination: బిగ్ బాస్ సీజన్ 07 మూడో వారం ముగిసింది. ఈ వారం మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారు. వీకెండ్ ఎపిసోడ్ కాస్త ఆసక్తికరంగా సాగింది. ముందుగా నాగార్జున కంటెస్టెంట్లతో ఓ గేమ్ ఆడించారు. ఇందులో కంటెస్టెంట్లు కలర్ వీల్ తిప్పుతూ ఉంటారు. అది ఏ కలర్ మీద ఆగుతుందో.. దానికి సంబంధించిన ప్రశ్నను అడుగుతారు నాగార్జున. ఈ గేమ్ లో ఒక్కొక్క కంటెస్టెంట్ మరో కంటెస్టెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముందుగా శోభాను హౌస్ లో కన్నింగ్ కంటెస్టెంట్ ఎవరని అడగగా పల్లవి ప్రశాంత్ పేరు చెప్పింది. ప్రశాంత్ కూడా శోభా పేరునే చెప్పాడు.  హౌస్ లో తేనె పూసిన కత్తి ఎవరిని నాగ్ దామినిని ప్రశ్నించగా.. సందీప్ పేరు చెప్పింది. ఇంట్లో నెగిటివిటీ స్ప్రెడ్ చేసేది ఎవరని సందీప్ ను అడగ్గా.. యావర్ పేరు చెప్పాడు. బ్యాక్ బిచింగ్ చేసేది ఎవరని యావర్ ను ప్రశ్నించగా.. రతిక పేరు చెప్పాడు. ఇలా ఒక్కొ కంటెస్టెంట్ ఒక్కో విషయాన్ని చెప్పుకుంటూ వచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ తర్వాత చీఫ్ గెస్ట్ గా స్టేజ్ పైకి హీరో రామ్ వచ్చాడు. స్కంద మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆయన బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేశారు. ఈ సందర్భంగా నాగార్జున కంటెస్టెంట్ల మధ్య డాన్స్ ఫేస్ ఆఫ్ పెట్టారు. రామ్, నాగ్ వారికి మార్కులు ఇచ్చారు. అనంతరం రామ్ వెళ్లిపోయారు. ఆ తర్వాత నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్ల నుంచి ఈ వారం దామిని ఎలిమినేట్ అయింది. దీంతో హౌస్ మేట్స్ అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత స్టేజ్ పైకి వచ్చిన దామినికి నాగార్జున ఓ టాస్క్ ఇచ్చాడు. కంటెస్టెంట్ల బొమ్మతో ఉన్న బెలూన్ ను పగులగొట్టి సలహాలు, సూచనలు ఇవ్వమని చెప్పాడు కింగ్. ఈ సందర్భంగా కంటెస్టెంట్లపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది దామిని. ఈ సమయంలో శివాజీ, దామిని మధ్య కాసేపు మాటల యుద్ధం నడిచింది. ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన ముగ్గురు కంటెస్టెంట్లు ఫీమేల్స్ కావడం విశేషం. వీరిలో తొలి వారం కిరణ్ రాథోడ్, రెండో వారం షకీలా, తాజాగా దామిని ఉన్నారు. 


Also Read: Jawan Movie: చరిత్ర సృష్టించిన షారుఖ్.. ఒకే ఏడాదిలో రెండు సార్లు 1000 కోట్లు కొల్లగొట్టిన హీరోగా రికార్డు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook