Bigg Boss Fame Urfi Javed Sizzling Dress With Nail Extensions: బిగ్ బాస్ OTT ఫేమ్ నటి ఉర్ఫీ జావేద్ తాను చేసిన సినిమాలు, సీరియల్స్ కంటే ఎక్కువగా తాను ధరించే వింత దుస్తుల వల్లే వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఉర్ఫీ జావేద్ దుస్తులను దేనితో అయినా తయారు చేసుకుంటూ ఉంటుంది, అద్దాల ముక్కలతో, స్ట్రాలతో, రాళ్ళతో ఇలా కాదేదీ బట్టల డిజైన్ కు అనర్హం అంటూ దేనితో పడితే దానితో బట్టలు డిజైన్ చేస్తూ ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఈరోజు 2022కి ఏడాది చివరి రోజు కావడంతో ఉర్ఫీ జావేద్ తన అత్యంత 'అసభ్యకరమైన', 'చౌక' దుస్తులను ధరించి సోషల్ మీడియాలో తన వీడియోను పంచుకున్నారు. ఉర్ఫీ జావేద్ వీడియోను షేర్ చేసుకుంటూ ఇలా వ్రాశారు- పేలవమైన దుస్తులు, 2022 సంవత్సరంలో అత్యంత అసభ్యకరమైన, అత్యంత సిగ్గులేని మరియు అత్యంత ఇష్టపడని వ్యక్తి.... ఉర్ఫీ జావేద్ అంటూ ఆమె కామెంట్ చేశారు.


ఇక ఉర్ఫీ జావేద్ కొత్త దుస్తుల గురించి చెప్పాలంటే ఆమె తాజా దుస్తులను నెయిల్ ఎక్స్‌టెన్షన్స్‌తో తయారు చేశారు. సాధారణంగా అమ్మాయిలు తమ గోళ్లు పెద్దవిగా చూపించుకోవడానికే ఈ నెయిల్ ఎక్స్‌టెన్షన్స్‌ వాడితో ఉంటారు. ఇక ఈ వీడియోలో, ఉర్ఫీ జావేద్ కొబ్బరి నీళ్లు తాగుతూ కనిపించింది, ఆ సమయంలోనే నెయిల్ ఎక్స్‌టెన్షన్స్‌ ఊడి పడిపోవడంతో ఆమె పక్కనే కూర్చున్న నటుడు అక్షిత్ సుఖిజ దీనితోనే డ్రెస్ తయారు చేసుకోవచ్చు కదా అని చెప్పడంతో ఆమె సరే తయారు చేయిస్తానని చెప్పింది.


కొద్దిసేపటి తర్వాత, వీడియోలో, ఉర్ఫీ జావేద్ నెయిల్ ఎక్స్‌టెన్షన్స్‌ తో చేసిన దుస్తులు ధరించి కనిపించింది. ఇక ఓపెన్ హెయిర్‌లో నెయిల్ ఎక్స్‌టెన్షన్స్‌తో తయారు చేసిన ఈ దుస్తులను ఉర్ఫీ జావేద్ ధరించింది. అంతేకాక ఆమె అందులో హొయలు పోతూ రెచ్చిపోయింది. 





Also Read: Tunisha Sharma Case: తునీషా మతం మార్చమని బలవంతం చేసిన షీజన్..మరో సీక్రెట్ లవర్ కూడా?


Also Read: VK Naresh-Pavitra Marriage: పవిత్రను పెళ్లి చేసుకోబోతున్నా.. ఆమెకు లిప్ లాక్ ఇస్తూ నరేష్ ప్రకటన!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook