Bigg Boss Inaya Sultana బిగ్ బాస్ బ్యూటీలకు సోషల్ మీడియాలో ఎక్కువగా పాపులారిటీ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అందులో కొంత మంది బుల్లితెరపై, వెండితెరపై రాణిస్తుంటారు. చాలా మంది భామలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటారు. సోషల్ మీడియాలో ఫాలోయింగ్‌ను పెంచుకునేందుకు రకరకరాల ఫోటో షూట్లు, వీడియోలను షేర్ చేస్తుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక బిగ్ బాస్ ఇంట్లో ఇనయ చేసిన హంగామా అందరికీ తెలిసిందే. ఇనయ పెట్టుకున్న గొడవలు, అరిచిన అరుపులు, రొమాంటిక్ సీన్లు, ఇనయ ఆర్జే సూర్య ట్రాక్, ఇనయ శ్రీహాన్ గొడవలు అందరికీ తెలిసిందే. అలా ఇనయ బిగ్ బాస్ ఇంట్లో ఉన్నప్పుడు తన మార్క్ వేసింది. ఇప్పుడు ఇనయ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది.


వర్మతో ఇనయ చేసిన డాన్స్‌, దానికి సంబంధించిన వీడియో ఎంతగా వైరల్‌ అయిందో తెలిసిందే. అక్కడి నుంచే ఇనయకు బిగ్ బాస్ ఇంట్లోకి పిలుపు వచ్చింది. ఇది వరకు ఇనయ ఆడపాదడపా పలు చిత్రాల్లోనూ కనిపించింది. తాజాగా ఆమె హీరోయిన్‌గా అవకాశం అందుకుంది. శివనాగు దర్శకత్వం వహిస్తున్న ‘నటరత్నాలు’ చిత్రంలో ఇనయా హీరోయిన్‌గా నటిస్తోంది.


ఈ సినిమాలో.. సుదర్శన్‌, రంగస్థలం మహేష్‌, అర్జున్‌ తేజ్‌ వంటి వారు నటించారు. ఈ సినిమాను ఎవరెస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పణలో చందన ప్రొడక్షన్స్‌ పతాకంపై డా. దివ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నర్రా శివనాగు దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మిగతా వివరాలు వెల్లడిస్తామని మేకర్లు ప్రకటించారు.