Kaushal Manda Wife Neelima: కరోనా నుంచి కోలుకున్న కౌశల్ భార్య నీలిమ, జై Paracetamol అని పోస్ట్
Kaushal Manda Wife Neelima Recovers from COVID-19: తన భార్య కరోనా బారిన పడిందని, తాను చాలా బాధలో ఉన్నానని, తనకు ఏం చేయాలో అర్థం కావడం లేదంటూ బిగ్‌బాస్ 2 ఫేమ్ కౌశల్ పోస్ట్ చేశాడు. నీలిమ కరోనాను జయించిందని కౌశల్ తాజా పోస్ట్‌లో తెలిపాడు.
Kaushal Mandas Wife Neelima Recovers from COVID-19: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2 విజేత కౌశల్ మండా అభిమానులకు శుభవార్త. కౌశల్ భార్య నీలిమ కరోనా బారి నుంచి కోలుకుంది. ఇటీవల తన భార్య కరోనా బారిన పడిందని, తాను చాలా బాధలో ఉన్నానని, తనకు ఏం చేయాలో అర్థం కావడం లేదంటూ బిగ్‌బాస్ 2 ఫేమ్ కౌశల్ పోస్ట్ చేశాడు.
విదేశాలలో ఉద్యోగం చేస్తున్న నీలిమ గత నెలలో కోవిడ్19 బారిన పడింది. 8 రోజుల చికిత్స అనంతరం కోలుకున్న నీలిమ నేషనల్ హెల్త్ సర్టిఫికెట్ తీసుకుని భారత్‌కు తిరిగొచ్చేసింది. తన కుటుంబంతో కలిసి దిగిన ఫొటోను బిగ్‌బాస్ 2 విజేత కౌశల్ మండా (Bigg Boss Telugu 2 Winner Kaushal Manda) ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. తన భార్య నీలిమ కరోనా నుంచి కోలుకుందని, భారత్‌కు తిరిగి రావడంతో సంతోషంగా ఉన్నానని పోస్ట్ చేశాడు. తన భార్య నీలిమి కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన, మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలిపాడు. జై పారాసిటమాల్ అని పోస్ట్ చేశాడు కౌశల్.
Also Read: Yami Gautam Wedding Photos: టాలీవుడ్ నటి యామీ గౌతం పెళ్లి ఫొటోస్ గ్యాలరీ
కౌశల్ భార్య నీలిమ యూకే ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో ఆమెకు కరోనా సోకగా తనకు మెరుగైన వైద్యం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు కేవలం పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఇచ్చారని, భారత్‌లో మెరుగైన వైద్యం దొరికేదని ఆవేదన వ్యక్తం చేసింది నీలిమ. శ్వాస సంబంధిత సమస్యలు రావడంతో ఛాతీలో నొప్పి వచ్చిందని, మీ అందరి ప్రేమ, ఆశీర్వాదంతో కాస్త కోలుకున్నానని వీడియో పోస్ట్ చేసింది. కౌశల్ అభిమానులు ఈ విషయంపై ఆందోళన చెందారు. తాజాగా నీలిమ కరోనా నుంచి కోలుకుని భారత్‌కు తిరిగొచ్చేసిందని ఫ్యామిలీ ఫొటోను బిగ్‌బాస్ 2 (Bigg Boss) విజేత కౌశల్ పోస్ట్ చేశాడు.
Also Read: Acharya Movie: విడుదలకు ముందే మెగాస్టార్ Chiranjeevi ఆచార్య సాంగ్స్ రికార్డులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook