బిగ్ బాస్ హౌజ్‌లో 16వ స్పెషల్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ ఎవలు ( Who is Gangavva ) ? బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఎట్లిచ్చింది ? గంగవ్వ జీవితం ఎలా సాగింది ( Gangavva personal life ) ? గంగవ్వ అసలు పేరు అదేనా ? లేక ఇంకేదైనా ఉందా ( Gangavva real name ) ? గంగవ్వ పూర్తి పేరు ఏంది ( Gangavva full name ) అనే విషయాలు తెల్సుకునేందుకు ఇప్పుడు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు కారణం ఆల్ట్రామోడర్న్ మనుషులకు తప్ప అసలు బిగ్ బాస్ రియాలిటీ షో అనేదెట్లా ఉంటుందో అంతగా తెలియని గంగవ్వ లాంటి పల్లెటూరి మహిళకు అందులో పాల్గొనే అవకాశం రావడమే. గంగవ్వ పూర్తి పేరు మిల్కూరి గంగవ్వ. జగిత్యాల జిల్లా లంబడిపల్లి ఆమె స్వస్థలం. 5 ఏళ్ల వయసులోనే పెళ్లి అయిన గంగవ్వకు నలుగురు సంతానం (ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు). చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు, కన్నీళ్లతోనే సాగిపోయింది గంగవ్వ జీవితం. Also read : Gangavva in BB4: బిగ్ బాస్ రియాలిటీ షోలో గంగవ్వ డైలాగ్స్ కెవ్వు కేక


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టాకా డబ్బులు సంపాదించేందుకని దుబాయ్ వెళ్లిన ఆమె భర్త... ఏడేళ్లు తిరిగి ఇంటిముఖం చూడలేదు. అలాగని ఆయన అక్కడి నుంచి నయాపైస పంపించిందీ లేదట.. ఆ విషయం కూడా గంగవ్వే చెప్పుకుని బోరుమంది. కానీ పిల్లలతో బతుకు బండి లాక్కొచ్చింది మాత్రం గంగవ్వే. ఒక బిడ్డకు చిన్నగున్నప్పుడే జబ్బు చేస్తే సర్కారు దవాఖానకు తీసుకుపోయిందట. అక్కడ సరైన వైద్యం అందక ఆ బిడ్డ దవాఖానలోనే చనిపోతే.. బిడ్డ శవాన్ని భుజాన వేసుకుని ఇంటిదాకా ఒక్కర్తే నడుచుకుంటూ వచ్చిన అని గుర్తుచేసుకుంటూ కన్నీళ్లు దిగమింగుకుంది. వర్షం వస్తే ఇళ్లంతా కురిసే ఇంట్లోనే ఏదో ఓ మూలకు సర్దుకుపోతూ.. పొలం పనులకు రోజు వారి కూలీగా వెళ్లే గంగవ్వ ఇప్పుడు సెలెబ్రిటీ అయ్యి బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టింది. ఎంతో కొంత డబ్బు సంపాదించుకుంటే.. మీ అందరి పేరు చెప్పుకుని ఓ ఇల్లు కట్టుకుని అందులో ఉంటా. ఇక నేనేడికీ పోను అని చెప్పే గంగవ్వను చూస్తే.. ఎవరికైనా సరే ఆమె కోరిక నెరవేరాలనే కోరుకుంటారు. నిజమే కదా మరి.. జీవితాంతం బిడ్డల కోసమే కష్టపడిన గంగవ్వ ఈ వయస్సులో కూడా ఇంకా కష్టపడుతోంది. ఆమెకు ఇకనైనా విశ్రాంతి అవసరమే కదా. Also read : Bigg Boss Telugu 4 Elimination: పాపం గంగవ్వ.. ఫస్ట్ వీక్ నామినేట్ అయ్యింది వీరే...


Gangavva videos.. పొలం పనుల నుంచి బిగ్ బాస్‌లోకి ఎంట్రీ వరకు ఆమె జీవితం ఎలా మలుపు తిరిగింది ? 
2012లో గంగవ్వ మేనల్లుడు అయిన శ్రీకాంత్ శ్రీరామ్ పొలాల మధ్య, పల్లెటూరి నేపద్యం ఉన్న వీడియోలు చేసి యూట్యూబ్‌లో పోస్ట్ చేసేవాడు. అలా గంగవ్వ కూడా ఆ వీడియోలలో నటించేది. మొదట్లో అప్పుడప్పుడు మాత్రమే వీడియోలలో కనిపించేది, తరువాత ఆమె సహజత్వానికి, ఆ పల్లెటూరి తెలంగాణ యాసకి ఆమెకి ఫాలొవర్స్ పెరిగిపోయారు. ఆ తరువాత గంగవ్వ 'మై విలేజ్ షో' ( My village show ) అనే యూట్యుబ్ చానల్‌తో యూట్యూబర్ అయింది. మై విలేజ్ షో ద్వారా తెలంగాణ గ్రామ సంస్కృతిని పరిచయం చేసింది. గంగవ్వ పల్లెటూరి నేపథ్యం అయినప్పటికీ సమాజం పట్ల ఆధునిక దృక్పథాన్ని కలిగి ఉంది. Also read : 
Singer Sunitha: బిగ్ బాస్ 4లో ఎంట్రీపై స్పందించిన సింగర్ సునీత


గంగవ్వ ఒక నిరక్షరాస్యురాలు. కానీ స్క్రిప్టుని చదివి వినిపిస్తే అదే గుర్తుంచుకొని డైలాగ్స్ చెప్పేదట. ఆమెకు ఇంట్లో టీవీ కూడా లేదు.. కానీ ఆమె చేసిన వీడియోలను ల్యాప్‌టాప్‌లో చూసి తనను తను మెరుగుపరుచుకునేది. ప్రస్తుతం గంగవ్వకు ఇన్‌స్టాగ్రామ్‌లో ( Gangavva on instagram ) దాదాపు 70 వేల ఫాలోవర్స్‌ ఉన్నారు. అలాగే గంగవ్వ 'ఇష్మార్ట్ శంకర్', 'మల్లేశం' అనే సినిమాలలో కూడా నటించింది.


58 ఏళ్ల వయస్సులో గంగవ్వ సాధించిన విజయాలు:
యూట్యూబ్ ఫ్యాన్ ఫెస్ట్ షోకేస్ హైదరాబాద్ 2018-2019 లో పాల్గొన్నారు.


NASSCOM ఫౌండేషన్ టెక్ ఫర్ గుడ్ సమిట్ (NASSCOM Foundation Tech for Good Summit) 2019లో పాల్గొని ప్రసంగించారు.


పద్మ మోహన అవార్డు ఆఫ్ ఎక్సలెన్స్ 2019తో సత్కరించారు.


తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉమెన్ అచీవర్ అవార్డు 2020తో సత్కరించింది.


సిఎన్ఎన్ ఛానెల్‌లో 'టెక్ ఫర్ గుడ్' ప్రోగ్రామ్‌లో నటించింది. 


ఇవే కాకుండా బిగ్ బాస్ 4 రియాలిటీ షోకు రాకముందే పలు టీవీ షోలలోనూ గంగవ్వ కనిపించింది. Also read : Bigg Boss 4 : బిగ్ బాస్ హౌజ్‌లోకి కంటెస్టంట్స్.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్


మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం...