Singer Sunitha: బిగ్ బాస్ 4లో ఎంట్రీపై స్పందించిన సింగర్ సునీత

బిగ్‌ బాస్‌ 4 తెలుగు రియాలిటీ షో ( Bigg Boss 4 Telugu ) ప్రారంభం కావడానికి మరో నాలుగు రోజులే మిగిలి ఉందనగా సింగర్ సునీత తాను ఈ రియాలిటీ షోలో పాల్గొంటున్నానంటూ వస్తున్న వార్తలపై స్పందించారు. సెప్టెంబర్ 6న బిగ్‌బాస్ 4వ సీజన్‌ ప్రారంభం కాబోతోంది.

Last Updated : Sep 3, 2020, 02:40 AM IST
Singer Sunitha: బిగ్ బాస్ 4లో ఎంట్రీపై స్పందించిన సింగర్ సునీత

బిగ్‌ బాస్‌ 4 తెలుగు రియాలిటీ షో ( Bigg Boss 4 Telugu ) ప్రారంభం కావడానికి మరో నాలుగు రోజులే మిగిలి ఉందనగా సింగర్ సునీత తాను ఈ రియాలిటీ షోలో పాల్గొంటున్నానంటూ వస్తున్న వార్తలపై స్పందించారు. సెప్టెంబర్ 6న బిగ్‌బాస్ 4వ సీజన్‌ ప్రారంభం కాబోతోంది. అందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్న షో నిర్వాహకులు.. షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్స్‌‌ను క్వారంటైన్‌కి సైతం పంపించారు. Also read : Pawan Kalyan b'day gift: పవన్ కల్యాణ్‌కి హీరోయిన్ బర్త్ డే గిఫ్ట్

బిగ్‌బాస్ తెలుగు 4వ సీజన్‌‌లో పాల్గొనబోయే కంటెస్టంట్స్ జాబితాలో ( Bigg boss 4 Telugu contestants list ) పలువురు సెలబ్రిటీల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో సింగర్‌ సునీత కూడా ఒకరు. అవును.. సింగర్ సునీత కూడా బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతోంది. Also read : Adipurush villain: విలన్ పాత్రపై ప్రభాస్ ఇచ్చిన అప్‌డేట్

Dear friends, I am not in the “Biggboss 4 Telugu”nor I will be 🙏🏻 FYI

Posted by Sunitha on Tuesday, September 1, 2020

బిగ్‌ బాస్‌ 4 రియాలిటీ షో త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో తన గురించి జరుగుతున్న ప్రచారంపై Singer Sunitha అదే సోషల్ మీడియా ద్వారా స్పందించారు. 'డియర్‌ ఫ్రెండ్స్‌.. నేను బిగ్‌బాస్ 4 తెలుగులో లేను. ఇకపై ఎప్పుడూ ఉండను కూడా. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్' అని ఆమె తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా స్పష్టం చేశారు. దీంతో సింగర్ సునీత ఎంట్రీపై ఆమె అభిమానులకు, బిగ్ బాస్ షో ఫాలోవర్స్‌కి ఓ క్లారిటీ వచ్చినట్టయింది. Also read : Bigg Boss 4 : బిగ్ బాస్ హౌజ్‌లోకి కంటెస్టంట్స్.. ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x