బిగ్‌బాగ్ తెలుగు 4 (Bigg Boss Telugu 4) హౌస్‌ను స్ట్రాంగ్ కంటెస్టెంట్ నోయల్ వీడాల్సి వచ్చింది. అనారోగ్య సమస్యలతో గత కొన్ని వారాలుగా నోయల్ సతమతవుతున్నాడు. దీంతో ఈ సీజన్‌లో మరో కంటెస్టెంట్ గంగవ్వ బాటలోనే సింగర్ నోయల్ (Singer Noel) బిగ్‌బాగ్ తెలుగు 4 హౌస్ నుంచి బయటకు వచ్చారు. గత కొన్ని రోజులగా నోయల్ అంత యాక్టివ్‌గా కనిపించడం లేదని బిగ్‌బాస్ షో చూస్తున్న ప్రేక్షకులకు తెలిసిందే. ఈ విషయంపై Bigg Boss Telugu 4లోస్ట్రాంగ్ కంటెస్టెంట్స్‌లో ఒకరైన నోయల్ ఫ్యాన్స్ చాలా బాధ పడుతున్నారు. హోస్ట్ నాగార్జున సైతం నోయల్‌లో జోష్ తగ్గిపోతుందని ఓ వీకెండ్‌లో ప్రస్తావించారు. అనారోగ్యం కారణమని నోయల్ బదులిచ్చారు.



 


బిగ్‌బాగ్ హౌస్‌లో ఇచ్చిన బీబీ బేబీ డే కేర్ టాస్కులో నోయల్ ఇబ్బందిపడ్డాడు. మొదట కొంతమేర ప్రయత్నించినా కాళ్లు నొప్పులు, భుజాల నరాలు లాగుతున్నట్లు అనిపిస్తుందని బిగ్‌బాస్‌కు చెప్పడంతో టాస్క్ నుంచి మినహాయింపు లభించింది. టాస్క్ పూర్తయిన తర్వాత సైతం కుంటుతూ కనిపించాడు నోయల్. అదివరకే ఓసారి వైద్యులు కంటెస్టెంట్ నోయల్‌ ఆరోగ్యాన్ని పరీక్షించారు. అయితే తాజాగా ఇబ్బంది పెరగడంతో మరోసారి డాక్టర్లను సంప్రదించాలని కోరాడు.



 


గురువారం రోజు ఎపిసోడ్‌లో నోయల్ ఆరోగ్యాన్ని ఓ డాక్టర్ చెక్ చేశారు. కొంత సమయానికి వైద్యుల టీమ్ సలహాలు, సూచనలు విన్న అనంతరం బిగ్‌బాస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సింగర్ నోయల్ కోరిక మేరకు మెరుగైన వైద్య అందించేందుకు సిద్ధమని తెలిపారు. అయితే అందుకోసం బిగ్‌బాగ్ తెలుగు 4 హౌస్ నుంచి బయటకు రావాలని సూచించగా అందుకు సరే అన్నాడు నోయల్.



 


ఇదే విషయాన్ని హౌస్ సభ్యులకు తెలిపాడు నోయల్. మరో కంటెస్టెంట్ హారిక కన్నీళ్లు పెట్టుకుంది. నువ్వు పూర్తి ఆరోగ్యంతో కోలుకుని రావాలంటూ బిగ్‌బాస్ హౌస్‌లో తోటి సభ్యులు నోయల్‌కు ధైర్యం చెప్పారు. అధైర్యపడవద్దని, అంతా మంచి జరుగుతుందని.. జాగ్రత్తగా ఉండాలంటూ చెప్పి కంటెస్టెంట్ నోయల్‌ను ఇంటి నుంచి బయటకు పంపించారు. అయితే బిగ్‌బాగ్ 4 హౌస్‌లోకి నోయల్ తిరిగి వెళ్తాడా.. లేదా అనేది అతడి ఆరోగ్యాన్ని బట్టి బిగ్‌బాస్ నిర్ణయించనున్నారు. 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe