Bigg Boss Telugu 6 Team Cheated Commoners: బిగ్ బాస్ సీజన్ సిక్స్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఇప్పటికే తెలుగులో ఐదు విజయవంతమైన సీజన్లను పూర్తి చేసిన బిగ్ బాస్ యాజమాన్యం ఇప్పుడు ఆరో సీజన్ కూడా విజయవంతంగా ప్రారంభించింది. అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ ఆరో సీజన్ సెప్టెంబర్ 4వ తేదీన సాయంత్రం గ్రాండ్ గా స్టార్ట్ అయింది. ఇక ఈ కర్టెన్ రైజర్ ఈవెంట్లో సుమారు 21 మంది కంటెస్టెంట్లు హౌస్ లోపలికి ఎంట్రీ ఇచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వారిలో చలాకీ చంటి, అభినయశ్రీ, అర్జున్ కళ్యాణ్, బాల ఆదిత్య, సుదీప, ఆరోహీ రావు, ఆర్ జె సూర్య, ఇనాయ సుల్తానా, గీతు రాయల్, శ్రీ సత్య, నేహా చౌదరి, వాసంతి కృష్ణన్, కీర్తి , రాజశేఖర్, ఫైమా, ఆదిరెడ్డి, సింగర్ రేవంత్, రోహిత్ మరీనా అనే బులితెర జంట, సై లాంటి సినిమాలలో కనిపించిన షానీ సాల్మన్, మోడల్ రాజశేఖర్ ఉన్నారు. అయితే బిగ్ బాస్ ఈసారి ఒక భారీ మోసానికి తెర లేపింది అంటూ ప్రచారం జరుగుతుంది.


అదేమిటంటే ఈసారి కొంతమంది కామనర్స్ అంటే కామన్ మ్యాన్లను, ఎవరికీ పరిచయం లేని వారిని హౌస్ లోపలికి తీసుకు వస్తామని ముందు నుంచి ప్రచారం చేసింది బిగ్ బాస్ యాజమాన్యం. అయితే చివరికి చూస్తే ఒక్క కామన్ మ్యాన్ కూడా లేకుండా బిగ్బాస్ సీజన్ 6 ప్రారంభమైంది. ఇందులో ఆదిరెడ్డిని కామన్ మ్యాన్ అని చెబుతున్నా ఆయన సోషల్ మీడియాలో అలాగే బిగ్ బాస్ ఫాలో అయ్యే వాళ్ళు చాలా మందికి పరిచయమే కాబట్టి ఆయన కామన్ మ్యాన్ కేటగిరీకి లోకి రారు.


ఇక దీంతో బిగ్ బాస్ 6 యాజమాన్యం ఈసారి భారీ మోసానికి తెరలేపిందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇలా కామన్ మ్యాన్ అనే వారిని తీసుకోవడం ఇష్టం లేనప్పుడు హైదరాబాద్ లో అలాగే మిగతా చోట్ల ఎందుకు ఆడిషన్స్ నిర్వహించారని ఎందుకు కామన్ మ్యాన్ టైం వేస్ట్ చేశారని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మీకు ఇష్టం లేదనుకుంటే ముందే చెప్పి ఉండాలని ఇలా ఆడిషన్స్ తీసుకుని తరువాత మీకు కావలసిన వాళ్లను లోపలి పంపడం అంటే వారిని అవమానించడమే అని, అది మంచి పద్ధతి కాదని సోషల్ మీడియాలో బిగ్ బాస్ కి చురకలు వేస్తున్నారు కొంతమంది నెటిజన్లు.
Also Read: Manchu Manoj on Bhuma Mounika Reddy: పెళ్లి వార్తలపై పెదవి విప్పిన మనోజ్.. మంచి రోజు కోసమే వెయిటింగ్ అంటూ!


Also Read: Manchu Manoj - Bhuma Mounika Reddy: పొలిటికల్ లీడర్స్ కుమార్తెతో మంచు మనోజ్ రెండో పెళ్లి?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి