బిగ్‌బాస్ సీజన్ 4లో మూడో స్థానంలో నిలిచినా విన్నర్‌కు దక్కినంత మొత్తం రూ.25 లక్షలు ప్రైజ్‌మనీ ఎగరేసుకపోయాడు కంటెస్టెంట్ సోహైల్. బిగ్‌బాస్ 4 ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించాడు. చివరికి మూడో స్థానంలో నిలిచినా తనకంటూ గత పదేళ్లుగా రాని గుర్తింపు ఇప్పుడు దక్కించుకుంటున్నాడు సోహైల్.  బిగ్‌బాస్ 4 హౌస్‌లో అతడు చెప్పిన డైలాగ్ ‘కథ వేరే ఉంటది’ మ్యానరిజం ప్రజల్లోకి బాగా వెళ్లింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఆఖరికి బిగ్ బాస్ 4 (Bigg Boss Telugu 4) విజేతకు అవార్డు అందించేందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి సైతం సోహైల్‌పై ప్రశంసలు కురిపించారు. కథ వేరే ఉంటదని డైలాగ్ సైతం చెప్పి అలరించారు చిరు. అయితే ప్రస్తుతం బిగ్‌బాస్ 4 తర్వాత పరిణామాలను గమనిస్తే ఈ షో తర్వాత సోహైల్ కథ నిజంగానే వేరేగా ఉంది. సింగరేణి ముద్దుబిడ్డ సోహైల్‌కు జార్జిరెడ్డి నిర్మాత అవకాశం ఇచ్చారు. నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి తెరకెక్కించనున్న మూవీలో సోహైల్ హీరోగా దక్కించుకున్నాడు. దీనిపై గురువారం హైదరాబాద్‌లోని ఫిలింఛాంబర్‌లో ప్రెస్ మీట్‌లో సినిమాను ప్రకటించారు.


Also Read: Bigg Boss 4 Telugu Funny Memes: బిగ్ బాస్ 4 ఫైనల్ తర్వాత వైరల్ అవుతున్న మీమ్స్



బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ సోహైల్(Sohel) నూతన దర్శకుడితో సినిమా ఒప్పుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు నిర్మాత అప్పిరెడ్డి. తమ మైక్ మూవీ నుంచి జార్జిరెడ్డి, ప్రెషర్ కుక్కర్ లాంటి సినిమాలు తీశామన్నారు. ఇప్పుడు బిగ్‌బాస్ ఫేమ్ సోహైల్‌తో మూవీ చేస్తున్నాన్నమని, ఇది కూడా సెన్సేషన్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.


Also Read: Bigg Boss Telugu 4: Sohel రూ.25 లక్షలు తీసుకుని ఎలిమినేట్! కథ వేరేనే ఉందా? 



బిగ్‌బాస్ 4 టాప్ 3 కంటెస్టెంట్ సోహైల్ మాట్లాడుతూ.. గతంలో చేసిన సినిమాలు తనకు గుర్తింపు ఇవ్వలేదన్నాడు. బిగ్ బాస్ ద్వారా తనకు గుర్తింపు దక్కిందని, చాలా మంది ఫ్రెండ్స్‌ను బిగ్ బాస్ ఇచ్చిందని చెప్పాడు. నిర్మాత అప్పిరెడ్డి కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తుండటం ఇండస్ట్రీకి శుభపరిణామం అన్నాడు. ఈ సినిమాతో అన్ని వర్గాల వారి మనసు గెలుచుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, తనకు అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలిపాడు.


Also Read: ​Bigg Boss Telugu 4: Sohel కథ వేరే ఉంటదంటే ఏంటో అనుకున్నారు.. కానీ!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook