Bigg Boss Telugu OTT: ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన రియాలిటీ షో బిగ్‌బాస్. అన్ని భాషల్లో ఆదరణ పొందుతూ విజయవంతంగా సీజన్లు లెక్కబెడుతోంది. తెలుగులో హోస్ట్ చేస్తున్న నాగార్జున పారితోషికం విషయంలో లేటెస్ట్ అప్‌డేట్ ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీవీ తెరపై రియాలిటీ షోలు చాలానే ఉన్నాయి. అన్నింటికంటే ఎక్కువ ప్రాచుర్యం పొందింది మాత్రం బిగ్‌బాస్ షో. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని భాషల్లో ఆదరణ లభిస్తోంది ఈ షోకు. ఇప్పుడు బిగ్‌బాస్ బుల్లితెర నుంచి ఓటీటీ వేదిక ఎక్కింది. వేదిక ఏదైనా షో మాత్రం రసవత్తరంగా మార్చేందుకు బిగ్‌బాస్ యాజమాన్యం ఎప్పటికప్పుడు సరికొత్త గేమ్ షో, సరికొత్త వ్యూహాలు రచిస్తుంటుంది. అవసరమైతే హోస్ట్‌ను మార్చేస్తుంది కూడా. ఎందుకంటే బిగ్‌బాస్‌ను రక్తి కట్టించడంలో వారానికి రెండుసార్లు దర్శనమిచ్చే హోస్ట్ పాత్ర చాలా కీలకం. సరికొత్త గేమ్‌లతో కంటెస్టెంట్లను బిజీ చేస్తూ..షో రక్తి కట్టించేలా చేయడం, వారానికి రెండు సార్లు రివ్యూ చేయడమనేది కీలకమైన టాస్క్. ఈ టాస్క్‌లో ప్రస్తుతానికి బిగ్‌బాస్ తెలుగులో కింగ్ నాగార్జున రక్తి కట్టిస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే వరుసగా మూడు సీజన్లలో చేసి..ఇప్పుడు నాలుగవ సీజన్ ఓటీటీ వేదికగా హోస్ట్ చేస్తున్నాడు.


ఈ నేపధ్యంలో బిగ్‌బాస్ తెలుగు హోస్ట్‌గా నాగార్డున ఎంత పారితోషికం తీసుకుంటున్నారనేది హాట్ టాపిక్‌గా మారింది. గత సీజన్‌కు 10-12 కోట్లు తీసుకున్నారని సమాచారం. అయితే కారణాలు తెలియదు కానీ ఈసారి పారితోషికాన్ని కొద్గిగా తగ్గించుకున్నట్టు తెలుస్తోంది. బిగ్‌బాస్ నాన్‌స్టాప్ హోస్టింగ్ కోసం 8-9 కోట్లు తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై అధికారిక ధృవీకరణ లేకపోయినా..ఆ మాత్రం తీసుకోవడంలో తప్పేమీ లేదనేది అభిమానుల వాదన.  


Also read: Mohan Babu vs Naga Srinu: మోహన్ బాబు ఇంట్లో ఏం జరుగుతుంది.. ? దొంగతనం నుండి కుల దూషణ.. ఎవరు కరెక్ట్ ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook