Mohan Babu vs Naga Srinu: మోహన్ బాబు అండ్ మంచు విష్ణు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. కుల దోషణ, బూతులు తిట్టడం, తల్లిని సైతం అవమానించడం. ఇవే ఇప్పుడు కొత్త ఆరోపణలు. అసలేం జరిగింది. ఏమైంది
మంచు విష్ణు, మోహన్ బాబు కుటుంబంపై తీవ్ర ఆరోపణలొస్తున్నాయి. మోహన్ బాబు వద్ద ఏళ్ల తరబడి హెయిర్ డ్రెస్సర్‌గా పనిచేసిన వ్యక్తి నాగశ్రీను వ్యవహారమిది. 5 లక్షల విలువైన హెయిర్ డ్రెస్సింగ్, మేకప్ మెటీరియల్ నాగశ్రీను దొంగిలించారంటూ మోహన్ బాబు కుటుంబం పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. ఇంతవరకూ బాగానే ఉంది. కేసులో నిజానిజాలేంటనేది పోలీసుల విచారణలో తేలుతుంది. నిజంగా నాగశ్రీను తప్పు చేశాడా లేదా, మోహన్ బాబు ఇంట్లో ఏం జరిగిందనేది పోలీసులు నిగ్గు తేలుస్తారు. అయితే నాగ శ్రీను జీ తెలుగు చర్చావేదికలో వెల్లడిస్తున్న విషయాలే సంచలనంగా మారాయి. మోహన్ బాబు కుటుంబంపై కొత్త వివాదానికి దారి తీస్తున్నాయి.
11 ఏళ్ల నుంచి ఆ ఇంట్లో పనిచేస్తున్న తనకు ఏ పాపం తెలియదంటున్నాడు నాగశ్రీను. ఆ రోజు అంటే ఫిబ్రవరి 17వ తేదీన మద్యాహ్నం భోజనం చేస్తున్న సందర్భంగా ఇంటికి పిలిచి..అత్యంత దారుణంగా అవమానించారని ఆరోపించాడు. నలుగురి ముందు మోకాలిపై కూర్చోబెట్టి దారుణంగా బూతులు తిట్టారన్నాడు. తన ఇంట్లో పిల్లల్ని, తల్లిని సైతం తిడుతూ అవమానించారన్నారు. తన కులాన్ని అవమానిస్తూ దూషించారని చెబుతున్నాడు. ఈ వ్యవహారంపై నాయీ బ్రాహ్మణ సంఘం మండిపడుతోంది. తప్పు చేసుంటే పోలీస్ స్టేషన్‌లో తేల్చుకోకుండా..మోకాలిపై కూర్చోబెట్టడం, కులాన్ని దూషించడం సరైంది కాదంటున్నారు. ఆధారాలు చూపించాలని..తక్షణం బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే మోహన్ బాబు ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. మోహన్ బాబు ఇంట్లో నాగశ్రీను దొంగతనం చేశాడా లేదా అనేది పోలీసులు తేలుస్తారని అంటున్నారు. కానీ కులాన్ని దూషించడం, మోకాలిపై కూర్చోబెట్టి అవమానించడంపై మాత్రం కచ్చితంగా క్షమాపణలు చెప్పాలని నాయీ బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఈ వ్యవహారం ఇప్పుడు వివాదంగా మారుతోంది. నాయి బ్రాహ్మణ సంఘాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జీ తెలుగు చర్చావేదికలో నాగశ్రీను, నాయీ బ్రాహ్మణ సంఘాలు చేసిన ఆరోపణలు ఎంతవరకూ నిజం, మోహన్ బాబు కుటుంబం ఏం చెబుతోంది, అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది అనేది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
Also read: Payal Rajput Photos: స్విమ్మింగ్ ఫూల్ వద్ద మెస్మరేజ్ చేస్తోన్న పాయల్ రాజ్ పుత్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook