Bigg Boss Telugu Season 6 Contestants List: బుల్లితెర ప్రేక్షకులందరూ విపరీతంగా ఎదురుచూస్తున్న బిగ్బాస్ రియాల్టీ షో మరికొద్ది గంటలలో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే తెలుగులో ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ఆరవ సీజన్ ఈరోజు సాయంత్రం 6 గంటలకు స్టార్ మా చానల్ తో పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్ లో కూడా ప్రత్యక్ష ప్రసారం కాబోతోంది. ఇక మూడవ సీజన్ నుంచి బిగ్ బాస్ తెలుగుకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున ఈ ఆరవ సీజన్ కి కూడా హోస్టుగా వ్యవహరించబోతున్నారు. ఇక ఈసారి హౌస్ లోకి ఏకంగా 21 మంది సభ్యులు ఎంటర్ అయినట్లుగా ప్రచారం జరుగుతుంది. అందులో సింహభాగం అమ్మాయిలు ఉండగా వారి కంటే తక్కువ సంఖ్యలో అబ్బాయిలు ఉన్నారని ప్రచారం జరుగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న లిస్టు మేరకే హౌస్ లోకి సభ్యులు వెళ్లాలని తెలుస్తోంది. ఇక మాకు అందిన సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. మొదటి కంటెస్టెంట్గా టీవీ9 యాంకర్ ఇస్మార్ట్ అంజలిగా పేరు తెచ్చుకున్న ఆరోహి ఎంట్రీ ఇచ్చింది. తర్వాత పలు టీవీ చానల్స్ లో యాంకర్ గా పని చేసిన నేహా చౌదరి కూడా కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చింది. ఇక సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యి తర్వాత బిగ్ బాస్ రివ్యూలు కూడా ఇస్తూ ఈ మధ్యకాలంలో జబర్దస్త్ లో కూడా మెరుస్తున్న గలాటా గీతూ కూడా ఎంట్రీ ఇచ్చారు. అలాగే వాసంతి కృష్ణన్ అనే ఒక నటి కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.


నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో పింకీ పాత్రలో కనిపించి తర్వాత కొన్ని సినిమాలలో కీలక పాత్రలలో నటించిన సుదీప కూడా ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అలాగే కార్తీకదీపం సీరియల్ లో హీరోయిన్ గా నటించి మంచి పేరు సంపాదించిన కీర్తి భట్, తెలుగు వారందరికీ సుపరిచితమైన డాన్సర్ అభినయశ్రీ కూడా హౌస్ లోపలికి ఎంట్రీ ఇస్తున్నారు. అలాగే జబర్దస్త్ ఫేమ్ ఫైమా, జీ తెలుగు సీరియల్ త్రినయనిలో నటించి ప్రదీప్ యాంకరింగ్ లో ఒక జీ తెలుగు రియాల్టీ షోలో కూడా పాల్గొన్న శ్రీ సత్య కూడా ఎంట్రీ ఇచ్చారు. అలాగే ఆ రామ్ గోపాల్ వర్మతో హీరోయిన్గా సినిమా చేసిన ఇనయా సుల్తానా కూడా ఎంట్రీ ఇస్తున్నారు. వీరు కాకుండా సీరియల్స్ లో నటిస్తున్న రోహిత్- మరీనా అనే ఒక జంట కూడా ఎంట్రీ ఇస్తున్నారు.


అలాగే చలాకీ చంటి, బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్ సిరి ప్రియుడు శ్రీహాన్, టాలీవుడ్లో పలు సినిమాల్లో బాలనటుడిగా కనిపించిన అడుగుపెట్టిన బాలాదిత్య, బిగ్బాస్ రివ్యూలు ఇస్తూ మంచి పేరు సంపాదించిన ఆదిరెడ్డి, సింగర్ రేవంత్, నటుడు అర్జున్ కళ్యాణ్, మోడల్ రాజశేఖర్ ఈసారి హౌస్ లోకి ఎంటర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొదటి కంటెస్టెంట్ గా కీర్తి భట్ ఎంట్రీ ఇచ్చారని చెబుతున్నారు. మొత్తం మీద ఈసారి ఇద్దరు కామన్ మ్యాన్ లను లోపలికి పంపించబోతున్నట్లు తెలుస్తోంది. అలా మొత్తం మీద 21 మందిని ఈసారి హౌస్ లోపలికి పంపినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయం మీద మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది ఈరోజు సాయంత్రం 10 గంటలలోపు హౌస్ లోకి ఎవరు వెళ్లారు అనే విషయం మీద అధికారిక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది.
Also Read: Charmi Kaur Social Media Break: బతకండి, బతకనివ్వండి.. మళ్ళీ బలంగా వస్తాం.. కీలక ప్రకటన చేసిన ఛార్మీ!


Also Read: iBomma One More Shock: మళ్లీ షాకిచ్చిన ఐబొమ్మ.. ఇక అలా చూడడం కుదరదట!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి