BiggBoss Telugu Season 5: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 ఆసక్తిగా నడుస్తోంది. అప్పుడే ఓ సభ్యురాలు ఎలిమినేట్ ప్రక్రియ కూడా ముగిసింది. బిగ్‌బాస్ సీజన్ 5 తెలుగులో హల్‌చల్ సృష్టిస్తుందనుకున్న సరయూ తొలివారంలోనే ఎందుకు ఎలిమినేట్ అయిందనేది చర్చనీయాంశమైంది. సరయూ ఎలిమినేషన్‌కు కారణాలివే


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 (BiggBoss Telugu Season 5)ప్రారంభమై అప్పుడే వారం గడిచింది. కంటెస్టెంట్లు ఎవరికి వారు మంచిగా పెర్ఫామ్ చేస్తున్నారు. తొలివారం గడవడమే కాదు ఎలిమినేషన్ ప్రక్రియ కూడా ముగిసిపోయింది. హౌస్‌లోని 19 మంది సభ్యుల్లో ఒకరు అప్పుడే ఎలిమినేట్ అయ్యారు. తొలివారంలో యాంకర్ రవి, హమీదా, జెస్సీ, సరయూ, మానస్, కాజల్‌లు నామినేషన్‌లో ఉండగా..ఎవరూ ఊహించని విధంగా సరయూ ఎలిమినేట్ అయింది. సరయూ ఎలిమినేషన్ ఆమె అభిమానులు నిరాశకు లోనైనా..ఎందుకా పరిస్థితి వచ్చిందనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. 7 ఆర్ట్స్ యూట్యూబర్‌గా పేరుగాంచిన సరయూ(Sarayu Elimination)కు మద్దతు ఎందుకు లభించలేదన్నది ప్రశ్నార్ధకంగా మారింది. 


మొదటి వారమే నామినేషన్ ఉండటంతో బిగ్‌బాస్(BiggBoss) సీజన్ 5 తెలుగు ఆసక్తిగా మారింది. సరయూని నామినేట్ చేసినవారిలో కాజల్, మానస్, వీజే సన్నీ ఉన్నారు. ఏ ఒక్కరు నామినేట్ చేయకపోయినా నామినేషన్(Nomination)జోన్‌లో ఉండేది కాదు. ఎలిమినేట్ అయ్యేది కాదు. సరయూ..బిగ్‌బాస్ హౌస్‌లో(BiggBoss House)అందర్నీ కలుపుకుని పోలేదనే వాదన విన్పిస్తోంది. తన పని తాను చేసుకోకుండా అనసవరంగా తగాదా పెట్టుకుందనే అభిప్రాయం నెటిజన్లలో ఉంది. అదే ఇప్పుడు సరయూ ఎలిమినేషన్‌కు కారణమైందని తెలుస్తోంది. కెప్టెన్సీ టాస్కులో కాజల్‌తో జరిగిన గొడవ కూడా ఓ కారణంగా తెలుస్తోంది. కెప్టెన్సీ పోటీలో ఉన్నవారికి ఎవరైనా మద్దతివ్వచ్చు లేదా డిస్టర్బ్ చేయవచ్చని బిగ్‌బాస్ స్పష్టంగా చెప్పినప్పుడు..సరయూ..విశ్వను టార్గెట్ చేసిన కాజల్‌తో(Kajol) గొడవ పడటం ఆమెపై నెటిజన్ల ఆగ్రహానికి కారణమైందని తెలుస్తోంది. టాస్క్‌ను అర్ధం చేసుకోకుండా అనవసరంగా గొడవకు దిగడమే కాకుండా మాటలు జారిందనే అపవాదు ఎదుర్కొంది. 


నామినేషన్‌లో ఉన్నప్పుడు మిగిలిన కంటెస్టెంట్లతో(BiggBoss Contestants) పోటీ పడుతూ స్క్రీన్ స్పేస్ కోసం ప్రయత్నిస్తే ఫలితముంటుంది. అయితే సరయూ మాత్రం అలా చేయకుండా గొడవకే ప్రాధాన్యత ఇచ్చినట్టు కన్పించింది. ప్రేక్షకుల్ని ఎలా తనవైపు తిప్పుకోవాలి, ఎలా ఓట్లు రాబట్టాలనే విషయాల్ని సరయూ పట్టించుకోకపోవడం కూడా ఆమెను హౌస్ నుంచి ఎలిమినేట్ చేసిందని చెప్పాలి. తొలివారం ముగిసేసరికి నామినేషన్స్‌లో ఉన్న ఆరుగురిలో సరయూ(Sarayu)చివరి స్థానంలో నిలిచింది. ప్రధానంగా యాంకర్ రవి, హమీదా, జెస్సీ, మానస్, కాజల్‌లు స్క్రీన్ స్పేస్‌ను వాడుకున్నంతగా సరయూ వాడుకోలేకపోయింది. అందుకే ఓట్లు సాధించలేక ఎలిమినేట్ అయింది. ఇక మరో కారణం బూతులు మాట్లాడటం స్కోకింగ్. ఇవి ఆమె వ్యక్తిగత అలవాట్లైనా సరే బిగ్‌బాస్ వీక్షకుల్లో ఉన్న ఫ్యామిలీ ఆడియన్స్ పాజిటివ్‌గా తీసుకోలేకపోయారని తెలుస్తోంది. మొత్తానికి ఈ అన్ని కారణాలు ఆమె ఓట్లకు గండి కొట్టాయి. ఆమెను ఎలిమినేట్ చేశాయి.


Also read: Bigg Boss 5 Telugu: ఆర్జే కాజల్ బండారం బయటపెట్టిన నాగ్..! ట్రోల్ చేస్తున్న నెటిజన్లు...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook