Salman Khan: బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ లక్ష్యంగా కొన్ని ముఠాలు రెచ్చిపోతున్నాయి. అతడిని అంతం చేసేందుకు పలువురు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల సల్మాన్‌ ఇంటి ముందు తుపాకులతో ఓ ముఠా కాల్పులు జరపడం కలకలం రేపగా.. తాజాగా మరో ముఠా సల్మాన్‌ను అంతం చేసేందుకు పన్నాగం పన్నారు. ఆ కుట్రను పోలీసులు తిప్పికొట్టడంత కొంత ఉపశమనం లభించింది. కానీ సల్మాన్‌ను చంపేందుకు కొన్ని ముఠాలు పని చేయడం అతడి అభిమానుల్లో కలవరం రేపుతున్నాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Suryadevara Nagendramma: 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి' నిర్మాత ఇంట్లో తీవ్ర విషాదం..


 


కొంతకాలంగా సినీ నటుడు సల్మాన్‌ ఖాన్‌ లక్ష్యంగా కొన్ని ముఠాలు రెచ్చిపోయాయి. మూడు నెలల కిందట బిష్ణోయ్‌ గ్యాంగ్‌ సల్మాన్‌ ఇంటి వద్ద కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ ముఠా వాళ్లు జైలులో ఉన్నారు. తాజాగా మరో ముఠా సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర పన్నారు. ఆ కుట్రను పోలీసులు భగ్నం చేశారు. సల్మాన్‌ను చంపేందుకు పాకిస్థాన్‌ నుంచి ఆయుధాలను రప్పించుకున్నారు. దీంతోపాటు సల్మాన్‌ కదలికలను గమనించేందుకు 15-20 మంది రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. వారు సల్మాన్‌ కదిలికలపై నిత్యం రెక్కీ నిర్వహిస్తుండేవారని పోలీసుల విచారణలో తేలింది.

Also Read: Nivetha pethuraj: పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన నటి నివేదా .. అసలేం జరిగిందంటే.. వీడియో వైరల్..


 


ముంబైలోని బాంద్రాలో సల్మాన్‌ ఖాన్‌ నివసిస్తున్నాడు. వీటితోపాటు పన్వేల్‌లో సల్మాన్‌కు ఫామ్‌ హౌస్‌ కూడా ఉంది. ఈ రెండు చోట్ల రెక్కీ నిర్వహించారని తెలిసింది. సల్మాన్‌ కారుపై ఏకే 47 తుపాకులతో దాడి చేసేందుకు బిష్ణోయ్‌ గ్యాంగ్‌ పథకం రచించినట్లు నిఘావర్గాల సమాచారం రావడంతో వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. సల్మాన్‌పై దాడి చేసి అనంతరం శ్రీలంక పారిపోవాలని బిష్ణోయ్‌ గ్యాంగ్‌ భావిస్తోంది. ఈ క్రమంలో హత్యకు ప్రణాళిక రచించారని భావిస్తున్న నలుగురిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో ధనుంజయ్‌ అలియాస్‌ అజయ్‌ కశ్యప్‌, గౌరవ్‌ భటియా అలియాస్‌ నహ్వీ, వాస్పీ ఖాన్‌ అలియాస్‌ వసీం చిక్నా, రిజ్వాన్‌ ఖాన్‌ అలియా జవే ఖాన్‌ ఉన్నారు. వారిని మరింత విచారణ చేసి కేసును మరింత లోతుగా విచారించనున్నారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter