Cine Glamour for BJP: అసలు ప్లాన్ అదే.. అందుకే మొన్న ఎన్టీఆర్ నిన్న నితిన్.. నెక్స్ట్ టార్గెట్ కూడా?
BJP Focusing For Cine Glamour in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ గట్టి ప్లానే వేసినట్టు కనిపిస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే
BJP Focusing For Cine Glamour in Telugu States: ప్రధానమంత్రి మోడీ మెగాస్టార్ చిరంజీవిని ఒక సభకు ఆహ్వానించడం కొన్నాళ్ల తర్వాత ఇటీవల ఒక సభ కోసం హైదరాబాద్ వచ్చిన అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ కావడం అటు తెలుగు సినీ వర్గాల్లో కాక తెలుగు రాష్ట్ర ప్రజలలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక తాజాగా మరో సభ నిమిత్తం హైదరాబాద్ విచ్చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డాతో సినీ హీరో నితిన్ అలాగే ఇటీవల క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ భేటీ అవ్వడం కూడా అనేక చర్చలకు తావిచ్చింది.
ఆ చర్చల మీద మరింత చర్చ జరిగే విధంగా బీజేపీ రాజ్యసభ ఎంపీ తెలంగాణ సీనియర్ నేత లక్ష్మణ్ మరో ఆసక్తికర ప్రకటన చేశారు. ప్రధాని మంత్రి నరేంద్రమోదీ కోసం బీజేపీ తరపున ప్రచారం చేయడానికి సినీనటుడు నితిన్ సిద్ధం అయ్యారని లక్ష్మణ్ పేర్కొన్నారు. అంతేకాక అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఇప్పటివరకు కేవలం సినీ చర్చలు జరిగాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంటే వారిద్దరి సమావేశంలో కూడా రాజకీయాలు చర్చకు వచ్చాయి అంటూ లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
త్వరలో నితిన్, మిథాలీరాజ్ ఇరువురు కూడా ప్రధాని నరేంద్ర మోదీ కలవనున్నారని ఆయన వెల్లడించారు. అయితే మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ప్రధాని మోదీ సూచన మేరకే మొదట బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసినట్లు నితిన్, మిథాలీ రాజ్ మీడియాకు తెలిపినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అయితే లేదు. నిజానికి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఎలా అయినా పాగా వేయాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. అయితే సినీ రంగం నుంచి గ్లామర్ విషయానికి వస్తే అటు టిఆర్ఎస్ కు కానీ కాంగ్రెస్ కి కానీ సినీ గ్లామర్ లేదు. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకోవడానికి బిజెపి ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.
ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశానికి ఉన్నంత సినీ గ్లామర్ మరో పార్టీకి ఉండేది కాదు. ఇప్పుడు బిజెపి సినీ గ్లామర్ ఉపయోగించుకునేందుకు సిద్ధమైంది అనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఎన్టీఆర్ తో రాజకీయపరంగా ఎలాంటి చర్చలు జరిపారు? తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా వ్యవహరిస్తూ ఉండే ఎన్టీఆర్ గత కొన్నాళ్లుగా మాత్రం తెలుగుదేశం పార్టీకి కూడా దూరంగా ఉన్నట్లు కనిపిస్తుంది. దీంతో ఆయనని బిజెపికి సపోర్ట్ చేయమని అడిగారా? లేక ఇంకేదైనా చర్చలు జరిగాయా అనే విషయం మీద కూడా చర్చ జరుగుతోంది.
Also Read: Nara and Nandamuri Families: రామోజీరావు సమక్షంలో నందమూరి-నారా కుటుంబాల భేటీ.. సంచలన విషయాలు వెలుగులోకి?
Also Read: Neha Shetty Pics: రాధికతో అట్లుంటది మరి.. బైక్ ఎక్కి మరీ నేహా శెట్టి హాట్ పోజులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి