Nara and Nandamuri Families: రామోజీరావు సమక్షంలో నందమూరి-నారా కుటుంబాల భేటీ.. సంచలన విషయాలు వెలుగులోకి?

Ramoji Rao Dinner Meeting with Nara and Nandamuri Families at Ramoji Film City: రామోజీరావు సమక్షంలో నందమూరి-నారా కుటుంబాల భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 28, 2022, 10:17 AM IST
Nara and Nandamuri Families: రామోజీరావు సమక్షంలో నందమూరి-నారా కుటుంబాల భేటీ.. సంచలన విషయాలు వెలుగులోకి?

Ramoji Rao Dinner Meeting with Nara and Nandamuri Families at Ramoji Film City: ఇటీవల బీజేపీ అగ్రనేత ఆ పార్టీలో నెంబర్ 2 గా భావించే అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన సమయంలో ఒకపక్క మీడియా మొఘల్ గా కీర్తించబడే రామోజీరావుతో అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ తో కూడా భేటీ అవ్వడం ఆశ్చర్యపరిచింది. అయితే ఇప్పుడు అంతకన్నా ఆశ్చర్యపరిచే వార్త మరోటి తెర మీదకు వచ్చింది.

అదేమంటే శనివారం రాత్రి నారా నందమూరి కుటుంబాలకు చెందిన కీలక వ్యక్తులు హైదరాబాద్ శివారు రామోజీ ఫిలిం సిటీలో డిన్నర్ కోసం మీట్ అయ్యారని తెలుస్తోంది. రామోజీరావు సమక్షంలో ఈ డిన్నర్ మీటింగ్ జరిగిందనే ప్రచారం మీడియా వర్గాల్లో జరుగుతోంది. రామోజీరావు నారా కుటుంబానికి నందమూరి కుటుంబానికి కూడా చాలా కావలసిన వ్యక్తి అని అంటారు. నారా చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి రామోజీరావు కృషి చాలా ఉందని భావిస్తూ ఉంటారు.

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సహా కళ్యాణ్ రామ్, బాలకృష్ణ అలాగే చంద్రబాబు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఇక ఈ భేటీ వెనుక అమిత్ షా రాయబారం ఏమైనా ఉండి ఉండవచనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ తెలుగు దేశంతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే అప్పుడు ఎన్టీఆర్ సహా నందమూరి కుటుంబం ప్రచారానికి వస్తారా? అలా వస్తే పొత్తుకు సిద్ధం అనే సంకేతాలు ఆయన పంపి ఉండవచ్చని అంటున్నారు.

ఎన్టీఆర్ సహా మరికొంత సినీ గ్లామర్ తోడైతే ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో కూడా బీజేపీకి ప్లస్ అవుతుందని అలా ఎన్టీఆర్ వంటి వారు ప్రచారానికి రావడానికి సిద్ధంగా ఉన్నామని చెబితే తెలుగుదేశంతో ఏపీలో లేదా రెండు తెలుగు రాష్ట్రాల్లో పొత్తు పెట్టుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదనే సంకేతాలు ఆయన రామోజీరావు ద్వారా నారా-నందమూరి కుటుంబాలకు పంపారా అందుకే ఈ భేటీ జరిగిందా అనే విషయం మీద చర్చ జరుగుతోంది.

మరి ఈ విషయంలో నిజంగానే ఊహాగానాలు మేరకు రామోజీరావు, నారా నందమూరి కుటుంబాలకు బిజెపితో పొత్తు విషయం మీద చర్చలు జరుపుతున్నారా? లేక ఇది సాధారణ డిన్నర్ మీటింగ్ ఏనా అనే విషయం మీద కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక బీజేపీ ఇలా సినీ గ్లామర్ వెంట పడడం చర్చనీయాంశంగా మారింది. 

Also Read: Indian Movies to Oscars: ఆస్కార్ బరిలోకి ఇండియన్ మూవీస్.. ఎలా సెలెక్ట్ చేస్తారో తెలుసా?

Also Read: Anasuya Bharadwaj Vijay Devarakonda: విజయ్ దేవరకొండకు దేవతలా మారిన అనసూయ "ఆంటీ’’

Trending News