Actor Amitabh Bachchan injuired: సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ కి గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆయన తన బ్లాగ్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతానికి ఆయన హైదరాబాదులో ప్రాజెక్టు కే షూటింగ్లో నటిస్తున్నారు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి ఆయనకి గాయాలు కావడంతో హాస్పిటల్ లో చికిత్స తీసుకుని ముంబై వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదే విషయాన్ని ఆయన తన బ్లాగ్ ద్వారా వెల్లడించారు. తాను హైదరాబాదులో ప్రాజెక్టు కే కోసం షూటింగ్ చేస్తున్న సమయంలో ఒక యాక్షన్ సీక్వెన్స్ లో గాయాలయ్యాయని. పక్కటెముక మృదులాస్థి పాపింగ్ విరిగిందని, కుడి పక్కటెముకకు కండరాలు చిరిగిపోయయని అందుకే షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్నానని పేర్కొన్నారు. హైదరాబాదులోనే డాక్టర్ ని కన్సల్ట్ అయ్యానని, ఏఐజీ హాస్పిటల్ లో సిటీ స్కాన్ కూడా చేయించాను అని అన్నారు. తర్వాత ముంబై వచ్చేసి రెస్ట్ తీసుకుంటున్నాను అని పేర్కొన్నారు.


తనకు కట్లు కట్టారని ప్రస్తుతానికి రెస్ట్ తీసుకోమని సలహా ఇచ్చారని పేర్కొన్నారు. కదులుతున్నప్పుడు ఊపిరి తీసుకుంటున్నప్పుడు బాధగా ఉంటుందని అంతా నార్మల్ అయ్యేందుకు కొన్ని వారాలు పడుతుందని డాక్టర్లు చెప్పారని ఈ సందర్భంగా అమితాబచ్చన్ పేర్కొన్నారు. నొప్పి తగ్గడానికి కూడా కొన్ని మందులు వాడుతున్నానని ఆయన అన్నారు. ఈ క్రమంలోనే తాను చేయాల్సిన అన్ని పనులను ఇప్పటికిప్పుడు క్యాన్సిల్ చేసుకున్నానని కొన్నింటిని వాయిదా వేశానని తాను తిరిగి కోలుకునే వరకు ఎలాంటి పనులు చేసే ఉద్దేశం లేదని ఆయన పేర్కొన్నారు.


ప్రస్తుతానికి తన ముంబై నివాసంలోనే ఉన్నానని అవసరమైన వాటి కోసం మొబైల్ ద్వారా పనులు చేస్తున్నానని పేర్కొన్నారు. కొన్ని రోజులపాటు పూర్తిగా బెడ్ కే పరిమితమవుతానంటూ ఆయన కామెంట్ చేశారు. ఈరోజు సాయంత్రం జల్సా గేటు వద్ద నా శ్రేయోభిలాషులను కలవడం లేదు, అలా కలవడం ఇబ్బందికరం. నేను కలవలేను, ఈరోజు ఎవరూ రావద్దు.


ఎవరైనా రావాలి అనుకుంటున్న వారు ఉంటే ఈరోజు రావద్దని చెప్పండి అంటూ ఆయన పేర్కొన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆయన ఈ విషయాన్ని నిన్ననే షేర్ చేశారు కానీ ఈ రోజు వెలుగులోకి వచ్చింది. ఇక ప్రాజెక్టుకే సినిమాని అశ్వినీదత్ భారీ బడ్జెట్లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అమితాబచ్చన్ తో పాటు దీపికా పడుకొనే వంటి వారు కూడా ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేస్తున్నట్లు అధికారిక సమాచారం అయితే విడుదలైంది.


Also Read: Venkatesh Maha on KGF2: ఆడంత నీచ్ కమీన్ కుత్తే ఎవడైనా ఉంటాడా?.. కేజీఎఫ్2పై కంచరపాలెం డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!


Also Read: Hollywood Touch for NTR 30 : ఎన్టీఆర్ 30 కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్.. ఇక తగ్గేదేలే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి