Hollywood Touch for NTR 30 : ఎన్టీఆర్ 30 కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్.. ఇక తగ్గేదేలే!

NTR 30 Movie Update:  ఎన్టీఆర్ 30వ సినిమాకి సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు కంపోజ్ చేయబోతున్నారని అని అంటున్నారు.  

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 5, 2023, 06:19 PM IST
Hollywood Touch for NTR 30 : ఎన్టీఆర్ 30 కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్.. ఇక తగ్గేదేలే!

Hollywood Stunt masters for NTR 30: జూనియర్ ఎన్టీఆర్ మరికొద్ది గంటల్లో అమెరికా బయలుదేరుతున్నారు. రేపు ఉదయం ఆయన హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లే ఫ్లైట్ ఎక్కబోతున్నారు. ఎందుకంటే మరికొద్ది రోజుల్లో అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో ఆస్కార్ అవార్డుల వేడుక ఘనంగా జరగనుంది. ఈ వేడుకలో నాటు నాటు లైవ్ పెర్ఫార్మన్స్ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. పర్ఫామెన్స్ ఇచ్చిన ఇవ్వకపోయినా సినిమా నుంచి కీలకమైన సభ్యులను ఆస్కార్ అవార్డులు కమిటీ ఆహ్వానిస్తుంది కాబట్టి ఎన్టీఆర్ కూడా వెళ్తున్నారు.

ఇక ఈ అవార్డుల కార్యక్రమంతో పాటు ఆయన కొందరు హాలీవుడ్ ఫిలిం మేకర్స్ ని అలాగే లోకల్ మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో మరోసారి ఎన్టీఆర్ కి జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో మీడియా కవరేజ్ లభించనుంది. అయితే మరోపక్క జూనియర్ ఎన్టీఆర్ తదుపరి చిత్రానికి సంబంధించిన కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించబోతోంది. ఇప్పటికే ఆమెకు సంబంధించిన ఫోటోషూట్ నిర్వహించగా రేపు ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలో నటిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇక మరోపక్క శంషాబాద్ లోని ఒక భారీ బహిరంగ ప్రదేశంలో ఈ సినిమా కోసం ప్రత్యేక సెట్ నిర్మించినట్లుగా తెలుస్తోంది. అక్కడే ఈ సినిమా షూటింగ్ జరగబోతున్నట్లు చెబుతున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు కంపోజ్ చేయబోతున్నారని అని అంటున్నారు.

అయితే ఏ హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు ఈ సినిమాకి యాక్షన్ కంపోజ్  చేయబోతున్నారు అనే విషయం త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ఈ సినిమాకి కూడా సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తుండగా అనిరుద్ రవి చంద్రన్ ఈ సినిమాకి సంగీతం అందించబోతున్నారు. ఈ సినిమాని యువసుధ ఆర్ట్స్ బ్యానర్ మీద సుధాకర్ మిక్కిలినేని, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద కళ్యాణ్ రామ్ బావమరిది కొసరాజు హరికృష్ణ నిర్మించబోతున్నారు.ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. అందుకు అనుగుణంగా సినిమా ప్రీ ప్రొడక్షన్ మీద చాలా దృష్టి పెట్టి ముందుకు వెళ్తున్నారు. 
Also Read: Bahubali2 Record Break: హిందీ సహా అన్ని బాషలలో బాహుబలి 2 రికార్డులు బద్దలు కొట్టడానికి ఎన్ని రోజులు పట్టిందంటే?

Also Read: Manchu Manoj Tributes: అత్తా మామలకు మంచు మనోజ్ నివాళులు..భార్యతో కలిసి భారీ కాన్వాయ్లో వెళ్లి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 
 

Trending News