Bollywood: బాలీవుడ్ కండలవీరుడికి ఇప్పుడు ఆమెపై ప్రేమ ఎక్కువవుతోంది. ముందు అమాయకత్వానికి..తరువాత అందానికి ఫిదా అయ్యాడు. కోరినంత డబ్బిస్తానంటున్నారు మరి..ఆమె ఓకే చెప్పిందా లేదా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మైనే ప్యార్ కియా సినిమా నుంచి పరిచయమై..అగ్రనటుడిగా ఎదిగి బాలీవుడ్‌ను శాసిస్తున్న హీరో సల్మాన్ ఖాన్. ఇప్పుడు కొత్తగా తెలుగు నటులతో కలిసి సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పేరు కభీ ఈద్ కభీ దివాళి. ఇందులో సల్మాన్ ఖాన్‌తో పాటు పూజాహెగ్డే, టాలీవుడ్ నటుడు వెంకటేశ్, జగపతిబాబు నటిస్తున్నారు. ఇప్పుడీ సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్ చక్కర్లు కొడుతోంది. అది షెహనాజ్ గిల్‌కు సంబంధించింది.


బిగ్‌బాస్ బ్యూటీ షెహనాజ్ గిల్ సైతం కభీ ఈద్ కభీ దివాళి సినిమాలో నటిస్తోందని తెలుస్తోంది. ఆమెపై మనసు పారేసుకున్న కండలవీరుడు సల్మాన్ అడగగానే ఓకే చెప్పేసిందట ఈ బ్యూటీ. వాస్తవానికి షెహనాజ్ అంటే సల్మాన్‌కు చాలా ఇష్టం. అభిమానం. మనసు పారేసుకున్నట్టున్నాడు బిగ్‌బాస్ 13వ సీజన్‌లో చూడగానే. తొలిసారి ఆమె అమాయకత్వాన్ని చూసి ఇంప్రెస్ అయ్యాడు. ఆ తరువాత ఆమె అందచందాల్ని చూసి ఫిదా అయ్యాడు. అప్పట్నించి షెహనాజ్ అంటే సల్మాన్‌కు ప్రత్యేకమైన ఇష్టం. అందుకే ఆ ఇష్టంతోనే షెహనాజ్‌కు కభీ ఈద్ కభీ దివాళీ సినిమాలో బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అంతేకాదు..ఆమె కోరినంత డబ్బు ఇవ్వాలని కోరాడట.


పారితోషికమనేది సాధారణంగా నిర్మాతల చేతిలో ఉంటుంది. ఇక్కడ మాత్రం షెహనాజ్ కదా. అందుకే ఎంత అడిగితే అంత ఇవ్వాల్సిందేనంటున్నాడు. అక్కడితే ఆగలేదు సల్లూ భాయ్. ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఆమెకు వీలైనప్పుడే షూటింగ్ పెట్టుకోవాలట. ఎంత నచ్చితే మాత్రం మరీ ఇంతలానా అని చెవులు కొరుక్కునేవాళ్లు కొరుక్కుంటూనే ఉన్నారు. మనసు పారేసుకుంటే అంతే మరి. 


Also read: Kiara Advani Oops Moment: స్లిట్ కట్ డ్రెస్‌లో కియారా అద్వానీ... కవర్ చేసుకోలేక ఎలా అవస్థ పడిందో చూడండి..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook