Alia Bhatt weds Ranbir kapoor: ఆ ఇద్దరు బాలీవుడ్ సెలెబ్రిటీల పెళ్లెప్పుడనేది ఫిక్స్ అయింది. లివింగ్ రిలేషన్ నుంచి ఇక రియల్ లివింగ్‌లో రానుంది ఆ జంట. ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తవగానే పెళ్లి ఉంటుందని ఆ నటి కన్ఫామ్ చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


బాలీవుడ్ స్టార్ సెలెబ్రిటీలుగా ఉన్న మహేశ్ భట్ ( Mahesh bhatt ) కుమార్తె ఆలియా భట్ ( Alia Bhatt )-రణ్‌బీర్ కపూర్ ( Ranbir kapoor ) రిలేషన్‌షిప్ ఇప్పుడొక హాట్ టాపిక్. బాలీవుడ్ వీధుల్లో ఎక్కడ విన్నా ఈ ఇద్దరి రిలేషన్‌షిప్ గురించే గాసిప్స్ విన్పిస్తున్నాయి. ఇప్పటికే లివింగ్ రిలేషన్‌లో ఉన్న ఈ ఇద్దరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనే విషయంపై చాలా వార్తలు వచ్చినా..ఇప్పుడిక దాదాపుగా కన్ఫామ్ అయింది. వెడ్డింగ్‌పై క్లారిటీ వచ్చింది.  


కరోనా వైరస్ ( Coronavirus ) కారణంగా రెగ్యులర్ షూటింగ్స్‌కు ఆటంకం కలగకుండా ఉండి ఉంటే ఈపాటికి పెళ్లి చేసుకునేవాళ్లమని రణ్‌బీర్ కపూర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. పెండ్లి పీటలెక్కేముందే షూటింగ్ కమిట్‌మెంట్స్ పూర్తి చేయాలని ఆలియా భట్ ( Alia Bhatt ) ఫిక్సయింది మరి. ప్రస్తుతం ఆలియా భట్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ షూటింగ్ ( RRR Shooting ) ‌లో ఉంది. ఆర్ఆర్ఆర్ ఫస్ట్ షెడ్యూల్‌ను ఇప్పటికే ఆలియా భట్ స్వయంగా పోస్ట్ చేసింది. పెళ్లి కారణంగా ఆలియా భట్ సెలవు తీసుకుంటే ఆర్ఆర్ఆర్ ప్రొడక్షన్ పనులు ఆలస్యమయ్యే అవకాశముంది. 


అందుకే సినిమా షూటింగ్‌కు ఇబ్బంది రాకుండా ఉండేందుకు  పెళ్లి వాయిదా వేసుకుంది. జనవరిలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకునేందుకు ప్లాన్ చేస్తోంది. ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి కాగానే పెళ్లి ( Wedding ) చేసుకోవాలని ఇప్పటికే ఆలియా భట్ నిశ్చయించుకుంది. 


Also read: Red movie: సంక్రాంతికి విడుదల కానున్న రెడ్ ..ఇక రామ్ విశ్వరూపమేనట