Janhvi Kapoor black dress pictures Goes Viral: అతిలోక సుందరి శ్రీదేవి తనయగా జాన్వీ కపూర్ బాలీవుడ్‌లోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తొలి సినిమా 'ధడక్' హిట్ కావడంతో.. జాన్వీకి వరుస ఆఫర్లు వచ్చాయి. తన అందం, నటనతో బాలీవుడ్‌లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జాన్వీ ఖాతాలో ప్రస్తుతం పలు సినిమాలు ఉన్నాయి. రూహీ, తక్త్, గుడ్ లక్ జెర్రీ, హెలెన్, మిస్టర్ అండ్ మిసెస్ మహీ సినిమాల్లో నటిస్తున్న జాన్వీ.. ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ అమ్మడు ఓ వైపు బాలీవుడ్‌లో దూసుకుపోతూనే మరోవైపు సౌత్‌పై కూడా ఫోకస్‌ పెట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జాన్వీ కపూర్ సినిమా షూటింగుల‌తో ఎంత బిజీగా ఉన్నా.. సోష‌ల్ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్‌‌గా ఉంటారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో తన సినిమా, వెకేషన్ ఫోటోలతో అభిమానులను అలరిస్తుంటారు. ఎప్పటికప్పుడు తన హాట్‌ ఫోటో షూట్‌కు సంబందించిన పోటోలను షేర్ చేస్తూ.. కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగుగెత్తిస్తుంటారు. దీంతో జాన్వీ ఫోటోస్, వీడియోస్ ఎప్పటికప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతూనే ఉంటాయి. ఈ క్రమంలో జాన్వీ తాజాగా తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఫొటోస్ కొన్ని 'బాప్‌రే' అనిపిస్తున్నాయి. 


జాన్వీ కపూర్ తాజాగా బ్లాక్ మినీలో సందడి చేశారు. అద్దం ముందు కూర్చుని ఫొటోలకు పోజులిచ్చారు. రకరకాల ఫోజుల్లో తన అందాలను ఆరబోశారు. ఆమె సిగ్నేచర్ మూమెంట్స్ వావ్ అనిపిస్తున్నాయి. ఇందుకు సంబందించిన పోటోలను బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. అవికాస్త వైరల్ అయ్యాయి. ఈ పోటోలకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. జాన్వీ అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. 



క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న  'మిస్టర్ అండ్ మిసెస్ మహీ' సినిమాలో జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఆమెకు జతగా రాజ్ కుమార్ రావ్ కీలక పాత్ర చేస్తున్నాడు. ఈ సినిమాలో ఇద్దరూ క్రికెటర్లుగానే కనిపించనున్నారని సమాచారం తెలుస్తోంది. అందుకే టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేష్ కార్తీక్ వద్ద జాన్వీ, రాజ్ కుమార్ ప్రత్యేకంగా క్రికెట్ పాఠాలు నేర్చుకున్నారు. ఇటీవలే డీకే స్పెషల్ క్లాసులు ఇచ్చారు. 


Also Read: Giloy Benefits: తిప్పతీగ తింటే లివర్‌ పాడవుద్దా?.. ఇందులో నిజమెంత, కేంద్రం ఏం చెబుతోంది?


Also Raed: Viral Video: ఈ ఛాన్స్ పోతే మళ్లీ రాదన్నట్టు స్టెప్పేసిన నవ వధువు.. చూస్తే షాకే!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook