Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ ఏం చేసినా సంచలనమే. ఆమె స్టయిల్ గానీ..స్టయిల్ ఆఫ్ సెన్స్ గానీ..నర్మగర్భంగా మాట్లాడే తీరు గానీ అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇప్పుడు మరో విషయాన్ని నిర్మొహమాటంగా పంచుకుని నివ్వెరపర్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


బాలీవుడ్ కథానాయిక ( Bollywood Actress ) కంగనా రనౌత్ ( Kangana Ranaut ) ఇటీవలి కాలంలో తరచూ వార్తల్లో ఉంటూనే..వివాదాస్పదం కూడా అవుతోంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ( Sushant singh rajput ) మరణ వ్యవహారం, ముంబై డ్రగ్స్ కేసు ( Mumbai Drugs case ) లో అయితే నిత్యం వార్తల్లో ఉంది. డ్రెస్సింగ్ స్టైల్‌లో విభిన్నంగా ఉంటూనే స్టైలిష్‌గా ఉండే కంగనా రనౌత్ అదే విషయమై సంచలన విషయం తెలిపింది. అందర్నీ ఆశ్చర్యపర్చింది. ఎందుకంటే ఖరీదైన బ్యాగ్‌లు, డిజైనర్ డ్రెస్సులు అన్నింటిలోనూ టాప్‌లో ఉండటాన్ని ఇష్టపడుతుంది కంగనా రనౌత్. బహుశా అందుకే కంగనా చెప్పిన ఈ మాట అందర్నీ నివ్వెరపర్చింది.


నిర్మొహమాటంగా అదే మాటను ట్వీట్ చేసింది. పాతరోజుల్ని గుర్తు చేసుకుని భావోద్వేగమైంది కూడా. ఆ సమయంలో డ్రెస్ కొనడానికి డబ్బులు కూడా లేవని చెప్పుకొచ్చింది. విమెన్ ఓరియెంటెడ్ మూవీలో ఆమెకు ఉత్తమ సహాయ కథానాయిక అవార్డు ( Best Supporting actress award ) లభించింది ఈ అవార్డును నాటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా అందుకుంది. ఆ సమయంలో మంచి డ్రెస్ కొనడానికి డబ్బుల్లేక..సొంతంగా తానే డ్రెస్ డిజైన్ చేసుకుని వేసుకుంది. అదే విషయాన్ని ట్వీట్ ద్వారా పంచుకుంది.



మహిళలే ప్రాధాన్యంగా ఉన్న సినిమాలో యువ నటిగా ఉన్నప్పుడు అవార్డు రావడం గొప్ప గౌరవమని..అది కూడా మహిళా రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోవడం మరీ విశేషమని కంగనా రనౌత్ పేర్కొంది. 


Also read: Varun Dhawan: బ్యాచిలర్ పార్టీకి వెళ్తుంటే కారు ప్రమాదానికి గురైన హీరో వరుణ్ ధావన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook