Varun Dhawan: బ్యాచిలర్ పార్టీకి వెళ్తుంటే కారు ప్రమాదానికి గురైన హీరో వరుణ్ ధావన్

Varun Dhawan Car Accident News Updates: బాలీవుడ్‌కు వారసత్వంగా ఎంట్రీ ఇచ్చి తనను తాను నిరూపించుకున్న నటుడు వరుణ్ ధావన్ నేడు పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. ఈ క్రమంలో బ్యాచిలర్ పార్టీకి వెళ్తుండగా ఆయన కారు ప్రమాదానికి గురైనట్లు సమాచారం.

Last Updated : Jan 24, 2021, 01:24 PM IST
  • బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ మరికొన్ని గంటల్లో పెళ్లిపీటలు ఎక్కడున్నాడు
  • బ్యాచిలర్ పార్టీకి వెళ్తుండుగా హీరో వరుణ్ ధావన్ కారు ప్రమాదానికి గురైంది
  • అలీబాగ్‌ వేదికగా ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో వరుణ్ ధావన్, నటాషాల వివాహం
Varun Dhawan: బ్యాచిలర్ పార్టీకి వెళ్తుంటే కారు ప్రమాదానికి గురైన హీరో వరుణ్ ధావన్

Varun Dhawan Car Accident News Updates: బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ మరికొన్ని గంటల్లో పెళ్లిపీటలు ఎక్కడున్నాడని తెలిసిందే. పలువురు సినీ సెలబ్రిటల మాదిరిగానే వరుణ్ ధావన్ వివాహం కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. అయితే ఎట్టకేలకు వివాహ బంధంలోకి అడుగు పెట్టనున్నాడు ఈ యంగ్ హీరో.

బ్యాచిలర్ పార్టీకి వెళ్తున్న వరుణ్ ధావన్ కారు ప్రమాదానికి గురైంది. ఓవైపు అలీబాగ్‌లో వరుణ్ ధావన్, నటాషా వివాహానికి ఫైవ్ స్టార్ హోటల్‌లో వీరి కుటుంబసభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ క్రమంలో బ్యాచిలర్ పార్టీకి వరుణ్ ధానవ్(Varun Dhawan Bachelor Party) తన కారులో బయలుదేరాడు. అయితే మార్గం మధ్యలో వరుణ్ ధావన్ కారు ప్రమాదానికి గురైందని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది. 

Also Read: Extra Data Offer: ఈ ప్లాన్స్‌తో 5 GB ఎక్స్‌ట్రా డేటా మీ సొంతం

వరుడు వరుణ్ ధావన్‌కు కారు ప్రమాదం‌(Varun Dhawan Car Accident)లో ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం. మరోవైపు తన బాయ్స్ గ్యాంగ్‌తో సరదాగా గడుపుతున్న ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో హీరో వరుణ్ ధావన్ శుక్రవారం నాడు షేర్ చేసుకున్నాడు. ఇందులో మెహందీ ఆర్టిస్ట్ వీనా నగ్డా కూడా ఉన్నారు.

Also Read: Chinki Minki Photos: వారెవ్వా.. ఒక్క ఫ్రేమ్‌లో డబుల్ అందాలు

కాగా, నేడు అలీబాగ్‌లోని ఫైవ్ స్టార్ హోటల్‌లో అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో బాలీవుడ్(Bollywood) నటుడి ఈ వివాహం జరగనుంది. జనవరి 24న వరుణ్ ధావన్, నటాషాల వివాహానికి పెద్దలు ముహూర్తం నిశ్చయించారు. సినిమా విషయానికొస్తే తన తండ్రి డేవిడ్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కిన కూలీ నెంబర్ 1 మూవీలో చివరగా వెండితెర మీద వరుణ్ ధావన్ సందడి చేశాడు.

Also Read: Effect Of COVID-19 Vaccine: కరోనా టీకాల ప్రభావం.. అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x