Kareena Kapoor and Amrita Arora test Covid 19 positive: బాలీవుడ్ హీరోయిన్లు కరీనా కపూర్, అమృతా అరోరా కరోనా (Coronavirus) బారినపడ్డారు. ఈ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఇటీవలి కాలంలో కోవిడ్ 19 ప్రోటోకాల్‌ను నిర్లక్ష్యం చేశారు. ఇద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకుని ముంబైలో పలు పార్టీలకు హాజరయ్యారు. తాజాగా వీరిద్దరు కరోనా బారిన పడినట్లు బృహత్ ముంబై కార్పోరేషన్ (BMC) ధ్రువీకరించింది. కరీనా కపూర్ (Kareena Kapoor), అమృత అరోరా ఇద్దరు కోవిడ్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారని పేర్కొంది. ఇటీవల కరీనా, అమృతలతో కాంటాక్ట్ అయినవారిని ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయించుకోవాల్సిందిగా బీఎంసీ ఆదేశించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరీనా కపూర్ (Kareena Kapoor), అమృత అరోరా (Amrita Arora)... ఇద్దరు కలిసి తరుచుగా పార్టీలకు హాజరవుతుంటారు. ఇటీవల కరిష్మా కపూర్, మలైక అరోరాలతో ముంబైలో (Mumbai) పార్టీ చేసుకున్నారు. కోవిడ్ 19 ప్రోటోకాల్‌ను ఉల్లంఘించి పార్టీలకు హాజరవడం వల్లే ఇద్దరికీ కరోనా సోకి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైతే అటు కరీనా, ఇటు అమృత దీనిపై స్పందించలేదు. మరోవైపు సోషల్ మీడియాలో ఈ ఇద్దరిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న తరుణంలో కరీనా, అమృత ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడమేంటని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల నటుడు కమల్ హాసన్ కూడా కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల చికిత్స తర్వాత ఆయన పూర్తి స్థాయిలో కోలుకున్నారు.


ఇక సినిమాల విషయానికి వస్తే... ప్రస్తుతం కరీనా కపూర్ బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్‌తో కలిసి లాల్ సింగ్ చద్దా సినిమాలో నటిస్తున్నారు. హాలీవుడ్ మూవీ టామ్ హాంక్స్‌కి ఇది రీమేక్. అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తెలుగు హీరో నాగ చైతన్య (Naga Chaitanya) కీలక పాత్రలో నటిస్తున్నాడు. అమీర్ ఖాన్‌తో కరీనా కపూర్ జోడీ కట్టడం ఇది మూడోసారి కావడం విశేషం.



Also Read: Rashmika: 'పుష్ప' ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో..ఆ విషయం తెలిశాక నేనెంతో బాధపడ్డాను: రష్మిక


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి