Rajinikanth Biopic Update: ఎంతో మందికి స్పూర్తి సినీ హీరో రజినీకాంత్ జీవితం. కండెక్టర్ స్థాయి నుంచి సూపర్ స్టార్ స్థాయికి ఆయన ఎదిగిన తీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం. రజినీ స్టైల్ కు, డైలాగ్ డెలివరీకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఆరు పదుల వయసులో కూడా ఎంతో ఎనర్జిక్ గా పనిచేస్తారు. అంతేకాకుండా వీలున్నప్పుడల్లా హిమాలయాలకు వెళ్లి ధ్యానం చేస్తారు. రజినీ చాలా నిరాండబరంగా గడుపుతారు. సూపర్ స్టార్ అన్న అహం ఏ మాత్రం ఉండదు, ఈ క్వాలిటీ చాలా కొద్ది మంది నటుల్లో మాత్రమే ఉంటుంది. అలాంటి అద్భుతమైన రజినీ జర్నీని వెండితెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్. సూపర్ స్టార్ బయోపిక్ సంబంధించి బాలీవుడ్ లో బజ్ నెలకొంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రజినీకాంత్ బయోపిక్ ను ప్రముఖ బాలీవుడ్ నిర్మాత సాజిద్‌ నడియాద్వాలా నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి ప్రీప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ మూవీ షూటింగ్ 2025లో ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా సాజిద్ పెట్టిన ఓ పోస్ట్ దీనికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. ప్రస్తుతం సాజిద్ 'సికింధర్' అనే మూవీకి నిర్మాతగా వ్యవహారిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ ముగిసిన తర్వాత రజినీ బయోపిక్ మీద వర్క్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. 


Also read: Keerthy Suresh:చిందులు వేస్తూ కీర్తి సురేష్.. ఈ కొత్త ఫోటోలు చూశారా


రజినీకాంత్ పాత్రలో తమిళ స్టార్ హీరో ధనుష్ నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ధనుష్ ఇళయరాజా బయోపిక్ లో నటిస్తున్నాడు. ధనుష్ కోసం వెయిచ్ చేస్తారా లేదా వేరొకరిని సెలెక్ట్ చేస్తారనేది తెలియాల్సి ఉంది. ఇందులో రజినీ వ్యక్తిగత జీవితంలోని ఆంశాలతోపాటు సినిమాల్లోకి వచ్చాక జరిగిన ముఖ్య సంఘటనలను చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రజినీ టి.జి.జ్ఞానవేల్‌ దర్శకత్వంలో ‘వెట్టయాన్’ అనే సినిమా చేస్తున్నారు. ఇది తెలుగులో 'వేటగాడు' పేరుతో రాబోతుంది. ఇందులో అమితాబ్‌, ఫహద్‌ ఫాజిల్‌, రానా తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. 


Also read: Pushpa Lyrical Song: నువ్వు గడ్డం అట్లా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే.. స్టెప్పులతో అదరగొట్టిన అల్లు అర్జున్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter