Pushpa Lyrical Song: నువ్వు గడ్డం అట్లా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే.. స్టెప్పులతో అదరగొట్టిన అల్లు అర్జున్

Pushpa 2 Update: తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పుష్ప సినిమా మొదటి లిరికల్ సాంగ్ వచ్చేసింది. పుష్ప.. పుష్ప.. పుష్ప అంటూ సాగే ఈ సాంగ్ మరోసారి యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసే లానే కనిపిస్తోంది..

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 1, 2024, 05:27 PM IST
Pushpa Lyrical Song: నువ్వు గడ్డం అట్లా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే.. స్టెప్పులతో అదరగొట్టిన అల్లు అర్జున్

Pushpa Lyrical Song: అల్లు అర్జున్ హీరోగా, రష్మిక హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా పుష్ప. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు సైతం సంపాదించి పెట్టింది. అయితే ఈ సినిమాలో అన్నిటికన్నా ఎక్కువ ప్రాధాన్యత సంపాదించుకుంది ఈ సినిమా పాటలు. దేవిశ్రీప్రసాద్ అందించిన సాంగ్స్ ఈ చిత్రానికే హైలెట్ గా నిలిచాయి. కాగా ప్రస్తుతం ఈ సినిమా రెండో భాగం ఆగస్ట్ 15న విడుదల కానుంది. ఈ క్రమంలో ఈ రెండో భాగంలోని పాటల కోసం తెలుగు సినీ ప్రేక్షకులు ఎన్నో రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు.

కొద్దిరోజుల క్రితమే పుష్ప ఫస్ట్ లిరికల్ పుష్ప.. పుష్ప.. పుష్ప.. సాంగ్ మే ఒకతను విడుదల చేస్తామని ప్రకటించారు సినిమా యూనిట్. మాట నిలబెట్టుకుంటూ ఈరోజు ఫస్ట్ లిరికల్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ఇక ఈ సాంగ్ తో మరోసారి పుష్ప తగ్గేదేలే..అంటూ చెప్పకనే చెప్పాడు. దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం ఈ సాంగ్ కి మరోసారి హైలెట్గా నిలిచింది.

నువ్వు గడ్డం అట్లా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే.. అని మొదలుపెట్టి.. ఆ తరువాత పవర్ఫుల్ లిరిక్స్ తో సాగిన ఈ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండ్ అవ్వడం ఖాయంలా కనిపిస్తోంది. ముఖ్యంగా అల్లు అర్జున్ మధ్యలో వేసిన స్టెప్పులు ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి మొదటి లిరికల్ తోనే రెండో భాగంలోని సాంగ్స్ కూడా మొదటి భాగం కి మించేలా ఉంటాయని హింట్ ఇచ్చేశారు రాక్ స్టార్.

కాగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో ఆగస్టు 15న విడుదలకు సిద్ధంగా ఉంది.

https://youtu.be/EdvydlHCViY?si=vSSLbhBj0uEKFwIM

 

Also Read: Light Beers: తాగుబోతుల పాలిట దేవుడయ్య నువ్వు.. లైట్‌ బీర్ల 'హీరో'కు ఘన సన్మానం

Also Read: Narendra Modi: 'ఆర్‌ఆర్‌ఆర్‌'తో దేశం గర్విస్తే.. 'ఆర్‌' ట్యాక్స్‌తో సిగ్గుపడుతోంది: ప్రధాని మోదీ

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News