బాలీవుడ్ హాట్ ఐటమ్ బాంబ్ మలైకా అరోరా గురించి తెలియనివారుండరు. ఈ మధ్యకాలంలో ఆమె సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రియుడు అర్జున్ కపూర్‌తో బహిరంగంగానే తిరుగుతుండటం దీనికి కారణం. ఇప్పుడీమె తల్లి కాబోతుందనే వార్తలు గుప్పుమంటున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సెలెబ్రిటీలు ఏం చేసినా క్షణాల్లో వైరల్ అవుతుంటుంది. ఒకవేళ ఏం చేయకపోయినా..పుకార్లు రాజ్యమేలుతుంటాయి. ఇందులో కొన్ని నిజాలుంటే..చాలావరకూ ఫేక్ ఉంటాయి. సోషల్ మీడియా విస్తృతి పెరిగేకొద్దీ సెలెబ్రిటీలపై వార్తలు వైరల్ అవుతూనే ఉంటాయి. వ్యూస్ కోసం న్యూస్ క్రియేట్ చేస్తుంటారు. ఇప్పుడు మరో వార్త ఇలాగే వైరల్ అవుతోంది. అది బాలీవుడ్ నటి, ఐటమ్ బాంబ్ మలైకా అరోరా మరోసారి తల్లి కాబోతుందనే వార్త జోరుగా ఊపందుకుంటోంది. 


మలైకా అరోరా ప్రెగ్నెన్సీ వార్తలపై మలైకా స్పందించకపోయినా..ప్రియుడు అర్జున్ కపూర్ స్పందించాడు. ఇలాంటి వార్తలపై అసహనం వ్యక్తం చేశాడు. మలైకా అరోరా ప్రెగ్నెన్సీ వార్తల్ని కొట్టిపారేశాడు. వ్యక్తిగత విషయాల్ని ప్రస్తావించవద్దంటూ మండిపడ్డాడు. మీరు వైరల్ చేసే విషయాలు మా జీవితాలపై ప్రభావం చూపిస్తాయని సీరియస్ అయ్యాడు అర్జున్ కపూర్. ఈ ఇద్దరూ చాలాకాలంగా కలికి తిరుగుతున్నా..రిలేషన్ షిప్ ని అధికారికం చేసింది 2019లో. పెళ్లి చేసుకోకుండా మొత్తం అంతా తిరిగేస్తున్నారు. బహుశా అందుకే ఇలాంటి వైరల్ వార్తలు.


Also read: Avatar 2 Movie: ఆ రాష్ట్రంలో అవతార్ 2 విడుదల కావడం లేదా, కారణాలేంటి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook