షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే నటించిన బాలీవుడ్ సినిమా పఠాన్ చుట్టూ వివాదం ముసురుకుంటోంది. సినిమాలో బేషరం పాటకు దీపికా పదుకొనే బికినీ దుస్తులతో రెచ్చిపోవడం వివాదానికి కారణమౌతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

షారుఖ్ ఖాన్ తాజా చిత్రం పఠాన్‌పై వివాదం రోజురోజుకూ పెరిగిపెద్దదవుతోంది. అటు సినీ, రాజకీయ ప్రముఖులు విభిన్నరకాలుగా స్పందిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇందులో బేషరం అనే పాటలో దీపికా పదుకొనే బికినీ దుస్తులతో రెచ్చిపోవడమే ఇందుకు కారణం. ఇందులోని రొమాంటిక్ దృశ్యాలపై ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. అదే సమయంలో మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని మరింతగా పెంచాయి.


దీపికా పదుకొనే దుస్తులు అభ్యంతరకరంగా ఉన్నాయని..అసలీ పాటే డర్టీ మైండ్‌తో చేసినట్టుందని నరోత్తమ్ మిశ్రా వ్యాఖ్యానించడం వైరల్ అయిపోయింది. దాంతో సినిమాను, దీపికా పదుకొనే దుస్తుల్ని విమర్శిస్తున్న బీజేపీ నేతలకు సీనియర్ నటుడు ప్రకాశ్‌రాజ్ కౌంటర్ ఇచ్చారు. బేషరమ్ బిగోట్స్ అంటూ కామెంట్ చేశారు. బ్రోకర్ ఎమ్మెల్యేలు, కాషాయ స్వామీజులు మైనర్లను అత్యాచారం చేసినప్పుడు వివాదాలుండవు, పబ్లిక్‌గా తిరిగినా ఏ ఇబ్బంది ఉండదు.. కానీ దిపీకా దుస్తులు మాత్రం ఇబ్బందిగా మారిపోతున్నాయా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 


సినిమా కోసం బోల్డ్‌డ్రెస్ వేస్తే తప్పేంటంటూ దీపికా పదుకొనేకు మద్దతు పలికారు. కాషాయం ముసుగులో చేసే అరాచకాలపై ఆయన స్పందించిన విధానం ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారుతోంది. 


బేషరమ్ రంగ్ పాటకు కుమార్ సాహిత్యం అందించగా, విశాల్-శేఖర్ స్వరకల్పన చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పాటపై వివాదం ఇంకెంత దూరం పోతుందా మరి. మరోవైపు జనవరి 25 న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌ను నిర్మాతలు వేగవంతం చేశారు. 


Also read: Kalyaan Dhev : ఓపిగ్గా ఉంటే.. అన్నింటికి సమాధానం దొరుకుతుంది!.. కళ్యాణ్ దేవ్ పోస్ట్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook