Prabhas వెంట పడుతున్న బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ Sajid Nadiadwala
Sajid Nadiadwala`s request to Prabhas: ప్రస్తుతం ప్రభాస్ చేతిలో కూడా ఇప్పటికే సలార్, ఆదిపురుష్, స్పిరిట్ లాంటి చిత్రాలున్నాయి. ఇవే కాకుండా రాధే శ్యామ్ మూవీ (Radhe Shyam teaser updates) పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోంది.
Sajid Nadiadwala's request to Prabhas: బాహుబలి సినిమాతో అమాంతం పెరిగిన ప్రభాస్ పాపులారిటీ రోజురోజుకూ మరింత పెరుగుతోంది. ప్రభాస్ అంటే ఇప్పుడు ఒక్క తెలుగు సినిమాలకే హీరో కాదు.. ప్యాన్ ఇండియా సినిమాలకు హీరో. బాహుబలి తర్వాత వచ్చిన సాహో, ఆ తర్వాత సైన్ చేసిన రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్, స్పిరిట్.. ఇలా ప్రభాస్ సైన్ చేసిన సినిమాలకు నేషనల్ వైడ్ మార్కెట్ ఉంది. అందుకే ప్రభాస్ (Prabhas) చేతిలో ఇప్పటికే నాలుగు సినిమాలు ఉన్నప్పటికీ.. ఇంకా దర్శకులు, నిర్మాతలు ఆయన వెంటపడటం ఆపడం లేదు.
ప్రభాస్ డేట్స్ (Prabhas dates) ఇస్తే సినిమా తీద్దామని బాలీవుడ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ క్యూలో నిలబడుతున్నారు. అలా ప్రస్తుతం ప్రభాస్ వెంట పడుతున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్లలో ఓ ఫేమస్ ప్రొడ్యూసర్ కూడా ఉన్నాడు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి దాదాపు స్టార్ హీరోలతో కలిసి సుమారు 35 కి పైగా చిత్రాలు చేసిన సాజిద్ నడియడ్‌వాలా (Sajid Nadiadwala) ప్రస్తుతం బాలీవుడ్ హీరోలను పక్కకు పెట్టి ప్రభాస్ వెంట పడుతున్నాడట.
Also read : Kota Srinivasa Rao comments on Nagababu: చిరంజీవి, పవన్ కల్యాణ్ లేకపోతే నాగబాబు ఎవరు ? : కోట శ్రీనివాస రావు
ప్రభాస్ డేట్స్ కేటాయిస్తే.. సాహో మూవీని మించిన యాక్షన్ సినిమాను తెరకెక్కించాలని సాజిద్ నడియడ్‌వాలా ప్లాన్ చేసుకుంటున్నాడని బాలీవుడ్ టాక్. అయితే, ప్రస్తుతం ప్రభాస్ చేతిలో కూడా ఇప్పటికే సలార్, ఆదిపురుష్, స్పిరిట్ లాంటి చిత్రాలున్నాయి. ఇవే కాకుండా రాధే శ్యామ్ మూవీ (Radhe Shyam teaser updates) పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతోంది. ఇలా చేతిలో ఉన్న సినిమాలే ఎప్పుడు పూర్తవుతాయో తెలీదు. ఇంకా కొత్త సినిమాలకు సైన్ చేయడం ఎందుకు అని ప్రభాస్ భావిస్తున్నాడట. అయితే, నెక్ట్స్ సినిమాకు సైన్ చేయడం అంటూ జరిగితే అది తనదే అయ్యుండాలని ప్రభాస్‌ని (Prabhas's next movie) సాజిద్ రిక్వెస్ట్ చేస్తున్నట్టు బాలీవుడ్ టాక్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook