Pawan Kalyan & Rana Daggubati Photo: ఒకరు భీమ్లా నాయక్.. మరొకరు డేనియల్ శేఖర్.. తగ్గేదేలే!

పవన్-రానా క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా  భీమ్లా నాయక్, ఈ రోజు ఇంటర్నెట్ లో ప్రత్యక్షమైన పవన్- రానా కలిసి దిగిన ఫోటో ఒకటి తెగ వైరల్ అవుతుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 21, 2021, 04:21 PM IST
  • పవన్-రానా క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా భీమ్లా నాయక్
  • సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానున్న సినిమా
  • నెట్ లో వైరల్ అవుతున్న పవన్-రానా కలిసి దిగిన ఫోటో
Pawan Kalyan & Rana Daggubati Photo: ఒకరు భీమ్లా నాయక్.. మరొకరు డేనియల్ శేఖర్.. తగ్గేదేలే!

Pawan Kalyan & Rana Daggubati Photo: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (PawanKalyan), రానా దగ్గుబాటి (RanaDaggubati) కలిసి నటిస్తున్న క్రేజీ మల్టి స్టారర్ మూవీ 'భీమ్లా నాయక్' అని మన అందరికి తెలిసిందే.. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో పవర్ ఫుల్ పాత్రలలో ఇద్దరు కలిసి నటిస్తున్నారు. 

ప్రస్తుతం ఒక ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. అది కూడా  రానా దగ్గుబాటి మరియు పవన్ కళ్యాణ్ పక్క పక్కన ఉన్న ఫోటో.. మాములుగానే  అభిమాన హీరో సింగిల్ గా ఉన్న ఫోటోలు చూస్తే అభిమానులు తెగ వైరల్ చేస్తారు.. అలాంటిది ఈ ఫోటోలో ఇద్దరు హీరోలు ఫోజులివ్వటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతుంది. 

Also Read: India Crosses 1 Billion Vaccination: భళా 'భారత్'.. 100 కోట్ల టీకాల పంపిణీ పూర్తి

ఈ ఫోటోలో జాతరలో ఉండే దుకాణాల సెట్ ఉండగా.. పవన్ షర్ట్ కు రక్తపు మరకలు ఉండటం, రానా షర్ట్  దుమ్ము  ఉండటం చూస్తుంటే ఫైటింగ్ సీన్ గ్యాప్ లో దిగిన ఫోటోలా ఉంది. ఏది ఏమైనా ఈ క్రేజీ కాంబినేషన్ సినిమా కోసం ఇటు దగ్గుబాటి ఫ్యాన్స్ (Daggubati Fans), అటు మెగా ఫ్యాన్స్ (Mega Fans) ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 

మలయాళంలో సూపర్‌హిట్‌ అందుకున్న ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌ (Ayyappanum Koshyam) కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవన్‌కల్యాణ్‌ (Pavan Kalyan) భీమ్లానాయక్‌ అనే పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారు. బీజుమేనన్‌ పోషించిన పాత్రను తెలుగులో పవన్‌, పృథ్వీరాజ్‌కుమార్‌ పోషించిన పాత్రలో రానా(Rana Daggubati) కనిపించనున్నారు. నిత్యామేనన్‌ (Nithya menon), ఐశ్వర్యా రాజేశ్‌ (Aishwarya Rajesh‌) కథానాయికలు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగవంశీ నిర్మిస్తున్నారు. తమన్‌ (SS Taman) స్వరాలు సమకూరిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Also Read: Fuel Price Hiked: దేశవ్యాప్తంగా ఆల్​టైం హైకి పెట్రోల్ రేట్లు- ప్రస్తుత ధరలు ఇవే..

అయితే పవన్ కళ్యాణ్ ఈ సినిమా తరువాత క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘హరిహర వీరమల్లు’ (HariHara Veeramallu) షూటింగ్ లో పాల్గొంటుండగా.. రానా, సాయి పల్లవి నటించిన ‘విరాట పర్వం’ సినిమా తవ్రలో విడుదల కానుంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

More Stories

Trending News