Kota Srinivasa Rao comments on Nagababu: చిరంజీవి, పవన్ కల్యాణ్ అనేవాళ్లే లేకపోతే ఈ నాగబాబు ఎవరు అని అనుకోవాల్సి ఉండేది అని సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు అన్నారు. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి, మరోవైపు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేకపోయి ఉంటే.. నాగబాబు ఒక ఆర్డినరి యాక్టర్ మాత్రమే అని అనుకోవాల్సి ఉంటుందని కోట శ్రీనివాస రావు మెగా బ్రదర్ నాగబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోట శ్రీనివాస రావు (Kota Srinivasa Rao vs Nagababu) ఈ వ్యాఖ్యలు చేశారు. నాగబాబుపై కోట శ్రీనివాస రావు అంత ఆగ్రహం వెళ్లగక్కడానికి కారణం మా అసోసియేషన్ ఎన్నికల సమయంలో కోట శ్రీనివాస రావును ఉద్దేశించి నాగబాబు చేసిన పలు వ్యాఖ్యలేనని తెలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. మా ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి కుటుంబం మద్దతుతో ప్రకాశ్ రాజ్ పోటీచేయగా.. ప్రకాశ్ రాజ్‌కి పోటీగా మంచు విష్ణు (Manchu Vishnu) పోటీచేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల మధ్య ఎన్నికల వేడి రాజకీయ పార్టీల మధ్య సార్వత్రిక ఎన్నికల వాతావరణాన్ని తలపించింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన మా అసోసియేషన్ ఎన్నికల్లో (MAA elections) నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, ఇతర సాంకేతిక నిపుణులు తమకు నచ్చిన వైపు నిలబడ్డారు. ప్రత్యర్థి వర్గానికి చెందిన వారిపై ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు.
ఈ క్రమంలోనే ప్రకాశ్ రాజ్‌కి (Prakash Raj) మద్దతుగా నిలిచిన మెగా బ్రదర్ నాగబాబు తనపై ఇష్టం వచ్చినట్టు నోరుపారేసుకున్నారని కోట శ్రీనివాస రావు ఆవేదన వ్యక్తంచేశారు. నాగబాబు తనని ఉద్దేశించి మాట్లాడుతూ.. కోట శ్రీనివాస రావుకు వయసైపోయిందని, ఇంకెంత కాలం బతుకుతాడో కూడా ఎవరికి తెలీదని, అలాంటప్పుడు ఇలాంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే బాగుంటుందని అనడం ఎంత మేరకు సబబు అని ఎదురు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే అసలు చిరంజీవి, పవన్ కల్యాణ్ చెరోవైపు లేకపోతే నాగబాబు అనేవాడు ఒక ఆర్డినరి యాక్టర్ మాత్రమే అని సంగతి గుర్తుంచుకోవాలని నాగబాబుకు (Kota Srinivas Rao slams Nagababu) హితవు పలికారు.
నాగబాబు వ్యాఖ్యలకు మా ఎన్నికల ప్రచారం సమయంలోనే తగిన విధంగా జవాబు ఇచ్చేవాడినని, కానీ మీడియా నన్ను ఈ చర్చల్లోకి ఎక్కడ లాగుతుందోననే భయంతోనే ఊరుకున్నాను అని కోట శ్రీనివాస రావు (Kota Srinivasa Rao comments on Anchor Anasuya) చెప్పుకొచ్చారు. కోట శ్రీనివాస రావు చేసిన ఈ వ్యాఖ్యలపై నాగబాబు (Nagababu comments on Kota Srinivasa Rao) మళ్లీ ఈసారి ఏమని స్పందిస్తారో వేచిచూడాల్సిదే మరి.
Also read : NCB raids Ananya Panday’s home: అనన్య పాండే నివాసంలో ఎన్సీబీ సోదాలు.. సమన్లు జారీ
Also read : Allu Arjun's wife Sneha Reddy: అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి పోస్ట్ చేసిన Maldives vacation video
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook