Brahmanandam: స్టార్ హీరోలను సైతం తలదన్నేలా బ్రహ్మానందం ఆస్తుల విలువ.. ఎన్ని వందల కోట్లు అంటే..
Brahmanandam: బ్రహ్మానందం ఈ పేరు చెబితేనే ప్రేక్షకులకు అదో తెలియని గిలిగింతలు కలుగుతాయి. తెలుగు సినిమాకు ఖాన్ దాదా అయినా.. కత్తి రాందాస్ అయినా.. మైఖేల్ జాక్సన్.. అంతకు మించి పద్మశ్రీగా ప్రేక్షకులను గిలిగింతలు పెట్టారు. ఈ రోజు బ్రహ్మానందం పుట్టినరోజు. 68వ ఏట అడుగుపెట్టిన ఈ లాఫ్ట్వేర్ ఇంజినీర్ తన కెరీర్‌లో ఎన్నో సినిమాల్లో విభిన్నమైన పాత్రలతో అలరించారు. సినిమాలతో పాటు ఈయన ఆస్తుల విలువ అదే రేంజ్‌లో పెరిగాయి.
Brahmanandam Net Worth: బ్రహ్మానందం తెలుగు ప్రేక్షకులతో ఈయనది విడదీయరాని అనుబంధం. గత మూడు దశాబ్దాలకు పైగా తన నవ్వులతో ప్రేక్షకులను గిలిగింతలు పెడుతూనే ఉన్నారు. ఆయన తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకులు నిజంగానే బ్రహ్మానందాన్నే పొందుతారు. తన కామెడీ టైమింగ్‌తో కొన్నేళ్ల పాటు తెలుగు సినీ ఇండస్ట్రీని ఏలారు. ప్రస్తుతం హార్ట్ ఆపరేషన్ తర్వాత ఆచితూచి సినిమాలు చేస్తున్నారు.
ఓ దశలో తెలుగులో విడుదలైన ప్రతి చిత్రంలో బ్రహ్మానందం పాత్ర ఉండాల్సిందే అనేంతగా ఆయన హవా కొనసాగింది. బట్టతలతో ఎంట్రీ ఇచ్చిన క్లాస్ నుంచి మాస్ వరకు బాల్కనీ నుంచి నేల టిక్కెట్ అనే తేడా లేకుండా అందిరితో విజిల్స్ వేయించగల స్టార్ ఎవ్వరైనా ఉన్నారా అంటే అది ఖచ్చితంగా మన బ్రహ్మానందం ఒక్కరే. తెలుగులో కొత్త కమెడియన్స్ రాకతో తెలుగులో బ్రహ్మానందం హవా కాస్తంత తగ్గిందనే చెప్పెకంటే.. ఆయనే స్వచ్ఛందంగా పక్కకు తప్పుకున్నారనే చెప్పాలి.
హార్ట్ ఆపరేషన్ తర్వాత వేళ్ల మీద లెక్కించే సినిమాలే చేస్తున్నారు. గతేడాది వీరసింహారెడ్డి, రంగమార్తాండ, బ్రో, కీడా కోలా వంటి సినిమాల్లో మాత్రమే నటించారు. తన కెరీర్‌లో అతి తక్కువ టైమ్‌లో వెయ్యి సినిమాలకు పైగా నటించి గిన్నీస్ బుక్‌లో చోటు సంపాదించుకున్నారు. అంతేకాదు తన జీవిత చరిత్రపై ఆత్మకథ కూడ రాసుకున్నారు.
బ్రహ్మానందంలో మంచి చిత్ర కారుడు కూడా ఉన్నారు. వీలైనపుడల్లా మంచి చిత్రాలు గీస్తూనే ఉంటారు. ఇక కేంద్రం సినీ రంగానికి ఈయన సేవలకు గాను 2009లో పద్మశ్రీతో గౌరవించింది. ఆ సంగతి పక్కన పెడితే.. తెలుగులో మోస్ట్ వాంటెడ్ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న ఈయన ఒక్కో కాల్షీటుకు రూ. లక్ష వరకు తీసుకుంటున్నట్టు సమాచారం. ఒక్కొసారి ఒక సినిమాకే రూ. కోటి వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారనేది సమాచారం. ఇక ఈయన పూర్తి పేరు కన్నెగంటి బ్రహ్మానందం. 1956 ఫిబ్రవరి 1న సత్తెనపల్లిలో జన్మించారు. తెలుగులో మాస్టర్స్ చేసిన ఈయన మొదట దూరదర్శన్‌లో వచ్చే పకపకలు కార్యక్రమంలో నవ్వులు పూయించారు. ఆ తర్వాత జంధ్యాల డైరెక్షన్‌లో వచ్చిన 'అహ నా పెళ్లంట' సినిమాలో ఛాన్స్ వచ్చింది. విడుదలైన మొదటి సినిమా 'శ్రీ తాతావతారం'.
బ్రహ్మానందం చేసిన పాత్రల విషయానికొస్తే.. అహ నా పెళ్లంటలో అరగుండుగా.. మనీలో ఖాన్‌దాదాగా.. పెదరాయుడుతో ధనుశ్‌గా.. అనగనగా ఒకరోజులో మైఖేల్ జాక్సన్‌గా.. అదుర్స్‌లో భట్టుగా.. రెడీలో మెక్‌డొనల్ మూర్తిగా.. పోకిరిలో బ్రహ్మా.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా.. రేసుగుర్రంలో కిల్ బిల్ పాండేగా.. వినాయక్.. కృష్ణలో బాబీగా ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే.. చెప్పుకుంటూ పోతే.. పెద్ద లిస్టే అవుతోంది. ఈ రేంజ్‌లో తెలుగు ప్రేక్షకులు బ్రహ్మానందం కామెడీని ఎప్పటికీ మరిచిపోలేరు. ఏ సినిమా యాక్టర్ పై లేనట్టుగా ఈయనపై బ్రహ్మానంద శతకం కూడా ఉంది.
ఇక బ్రహ్మానందం సినిమాల్లో తాను సంపాదించిన డబ్బులను రియల్ ఎస్టేట్‌తో పాటు.. స్టాక్ మార్కెట్.. మరికొన్ని వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టారు. మొత్తంగా బ్రహ్మానందం తను సంపాదించిన సంపాదనలో ఎక్కువగా భూములపైనే పెట్టుబడి పెట్టారు. అదే ఆయన్ని కోట్లకు అధిపతిని చేసింది. ఇపుడున్న మార్కెట్ వాల్యూ ప్రకారం బ్రహ్మానందం ఆస్తుల విలువ.. రూ. 700 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఏ దురలవాట్లు లేని కారణంగా బ్రహ్మీ ఈ రేంజ్‌లో కూడబెట్టగలిగాడని అందరు చెప్పుకుంటారు.
Also Read: India Vs Eng: ఉప్పల్‌లో భారత జట్టుకు తీవ్ర నిరాశ.. టామ్ హార్ట్‌లేకు హార్ట్ లేదబ్బా
Also Read: Bottole Thrash: 'బాటిల్' కోసం చెప్పుతో కొట్టిన ప్రముఖ గాయకుడు.. నెట్టింట్లో తీవ్ర దుమారం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.