Britney Spears calls end of conservatorship 'best day ever': పాప్ సెన్సేషన్​ బ్రిట్నీ స్పియర్స్​ విముక్తి లభించింది. దశాబ్ద కాలానికిపైగా తండ్రి చెరలో ఉన్న ఆమె (Britney Spears conservatorship ended) ఎట్టకేలకు బయటపడ్డారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆమె తండ్రికి ఉన్నసంరక్షణ బాధ్యతలను తొలగిస్తూ.. అమెరికా లాస్​ ఏంజలెస్​లోని కోర్టు తీర్పునిచ్చింది. దీనితో 14 ఏళ్లుగా ఆమెకు స్వేచ్ఛ లభించింది.


అమె తన జీవితంలో ఇదే అత్యంత మంచి రోజు ఇదే అంటూ భావోద్వేగానికి (Britney Spears latest news) లోనయ్యారు. ఇందుకు సంబంధించి ట్విట్టర్​లో ఓ పోస్ట్ చేశారు.


బ్రిట్నీ స్పియర్స్​కు విముక్తి లభించిందని తెలిసి కోర్టు బయట అమె ఫ్యాన్స్ (Britney Spears Fans) సంబరాలు చేసుకున్నారు.



Also read: NBK 107 Movie: మాస్ కాంబినేషన్ షురూ.. బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమా స్టార్ట్


తండ్రితో వివాదమేమిటి?


బ్రిట్నీ స్పియర్స్​కు 2008లో మానసిక సమస్యలు ఎదుర్కొంది. ఈ సమయంలో అమె సంరక్షణ బాధ్యతలను తండ్రి తీసుకున్నారు. అమె ఆస్తులు, డబ్పుల నిర్వహణ అన్ని తానే చూసుకున్నారు. అయితే సంరక్షణ పేరుతో.. తన తండ్రి తన స్వేచ్ఛను హరిస్తున్నారని గత కొంత కాలంగా బ్రిట్నీ స్పియర్స్ వాపోతోంది. ఈ విషయంపై కోర్టును ఆశ్రయించి.. తనకు విముక్తి కల్పించాలని కోరింది.


Also read: Allu Arjun vs Nani: నానికి అల్లు అర్జున్‌ షాక్‌..ఇప్పుడిదే హాట్ టాఫిక్ గురూ..!


Also read: Ooriki Uttharana Trailer : ప్రభుత్వ పథకాలకు అర్హత లేనోడివి పెళ్లి చూపులకు ఎందుకొచ్చావ్​?


కోర్టుకు బ్రిట్నీ స్పియర్స్​ ఏం చెప్పారంటే..


తన తండ్రి వల్ల తీవ్ర మనోవేదనను అనుభవిస్తున్నట్లు కోర్టుకు చెప్పారు బ్రిట్నీ స్పియర్స్​. 13 ఏళ్లుగా ఆయనతో ఇబ్బందులు పడుతున్నానని వివరించారు. తన జీవితాన్ని తనకు తిరిగి ఇచ్చేయాలని కోర్టును వేడుకున్నారు.


బ్రిట్నీకి మద్దతుగా ఆమె అభిమానులు.. గతంలో ఫ్రీబ్రిట్నీ అనే ఆన్​లైన్​ ఉద్యమం కూడా ప్రారంభించారు. ఆమె ఇలా ధైర్యంగా మాట్లాడటం చూసి.. పలువురు మెచ్చుకుంటున్నారు కూడా.


ఆమె వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం తండ్రి జేమ్స్​ను సంరక్షణ బాధ్యతల నుంచి తప్పించింది. 


Also read: Shocking News about Sudhir:జబర్దస్త్ కు గుడ్ బై చెప్పిన సుడిగాలి సుధీర్ అండ్ టీమ్..??


Also read: Rashi Khanna Photos: ‘పక్కా కమర్షియల్’ భామ రాశీఖన్నా శారీ ఫొటోలు వైరల్..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook