Allu Arjun vs Nani: నానికి అల్లు అర్జున్‌ షాక్‌..ఇప్పుడిదే హాట్ టాఫిక్ గురూ..!

Allu Arjun vs Nani: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్...నేచురల్ స్టార్ నానికి షాకిచ్చాడు. శ్యామ్ సింగ రాయ్ రిలీజ్ కు పోటీగా బన్నీ పుష్ప రానున్నట్లు సమాచారం.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 13, 2021, 01:33 PM IST
Allu Arjun vs Nani: నానికి అల్లు అర్జున్‌ షాక్‌..ఇప్పుడిదే హాట్ టాఫిక్ గురూ..!

Allu Arjun vs Nani: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం శ్యామ్ సింగ రాయ్(Shyam Singha Roy). ఈ మూవీని డిసెంబరు24న ప్రేక్షకుల మందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించారు. సోలోగా బరిలోకి దిగుతున్న నాని(Hero Nani)కి బన్నీ ట్విస్ట్ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పుడు ఈ రూమరే ఇండస్ట్రీలో హాట్ టాఫిక్ గా మారింది. డిసెంబర్ 17న రిలీజ్ ముహుర్తం ఫిక్స్ చేసుకుని పుష్ప(Pushpa Movie)ను ప్రమోట్ చేస్తున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Hero Allu Arjun). కాని ఇప్పుడు ఈ మూవీని డిసెంబర్ 25న తీసుకురావాలనుకుంటున్నాడట.

Also Read: Radheshyam First Single: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘రాధేశ్యామ్’ తొలి సాంగ్ రిలీజు డేట్ ఫిక్స్

నిజానికి మొదట డిసెంబర్ చివరి వారంలోనే పుష్పను రిలీజ్ చేయాలనుకున్నారు మూవీ మేకర్స్. కానీ అల్లు ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేస్తూ..వారం ముందుగానే ఈ ప్యాన్ ఇండియా(Pan India Movie) మూవీని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు దర్శకనిర్మాతలు. ఇఫ్పుడు రిలీజ్ డేట్ పై యూనిట్ మరోసారి యూటర్న్ తీసుకోవడానికి కారణం ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడమే అట. అదే నిజమైతే సౌత్ మొత్తం భారీ స్థాయిలో రిలీజ్ కు రెడీ అవుతున్న శ్యామ్ సింగ రాయ్ కు, పుష్ప బిగ్ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News