Prabhas Next Movie: స్టార్ హీరో అన్నాక కేవలం ఒక జోనర్ సినిమాలకు మాత్రమే పరిమితం అవ్వకుండా అన్ని రకాల సినిమాలు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో యాక్షన్ సన్నివేశాలలో కూడా నటించాల్సి ఉంటుంది. సినిమాలలో ఫైట్ సీన్లను మాత్రమే చూసి ఎంజాయ్ చేసే ప్రేక్షకులు కూడా ఉంటారు అంటే అతిశయోక్తి కాదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఫైట్ సన్నివేశాలు చూడటానికి ఎలా ఉన్నా షూటింగ్ సమయంలో మాత్రం ఆ నటీనటులు చాలా కష్టపడాల్సిన ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హీరో ఫైట్ సీన్ అంటే ఉండే ఎలివేషన్లు భారీ స్థాయిలో ఉంటాయి. యాక్షన్ సీన్స్ లో నటించాలి అంటే అనుకోకుండా కొన్నిసార్లు దెబ్బలు కూడా తగులుతూ ఉంటాయి.


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా షూటింగ్ సమయంలో ఎన్నోసార్లు గాయపడ్డారు. కానీ ఒకసారి మాత్రం ప్రభాస్ షూటింగ్ సెట్ లో ఉన్నప్పుడు సెట్లో ఉన్న వాళ్ళందరూ బెంబేలెత్తిపోయారు. ఇది బుజ్జిగాడు సినిమా షూటింగ్ అప్పటి విషయం. ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన సంజన గల్రాని ఆ విషయాన్ని బయటపెట్టారు. 


"ఒకరోజు ఒక ఇన్సిడెంట్ అయింది. ఆ టైంలో నే స్పాట్ లో లేను కానీ అది విన్నా వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళాను. నేను మాత్రమే కాదు సెట్ లోని వాళ్ళందరూ ఎక్కడ పని అక్కడ ఆపేసి పరిగెత్తుకుంటూ ప్రభాస్ దగ్గరికి వెళ్ళారు. ఏదో టేక్ సమయంలో ప్రభాస్ గారు కింద పడ్డారు. అప్పుడు ఒక బస్ అయిన మీద నుంచి వెళ్ళింది" అంటూ ప్రభాస్ కి అయిన యాక్సిడెంట్ గురించి చెప్పారు సంజన.


"బస్ మనకి తగలకపోయినప్పటికీ మన మీద నుంచి ఒక బస్ వెళితే ఎంత కంగారు పడతాం. ప్రభాస్ గారు ఏ మాత్రం కంగారుపడలేదు. ఎవరినీ కంగారు పెట్టలేదు. అందరూ వచ్చి అడుగుతున్నా కూడా బాగానే ఉన్నాను అంటూ చాలా కూల్ గా ఉన్నారు. ఆయన నిజంగా ఒక రియల్ లైఫ్ హీరో" అని అన్నారు సంజన. 


"చాలామంది హీరోలకి ఇలా యాక్షన్ సీన్స్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ లు అవుతాయి. చాలామంది హీరోలు ఇలాంటి యాక్షన్ సన్నివేశాలు చేస్తూ దెబ్బలు తిని సర్జరీలు కూడా చేయించుకున్నారు. కానీ అదృష్టవశాత్తు ఆ రోజు ప్రభాస్ గారికి ఏమి కాలేదు" అని అన్నారు సంజన.


ఇక సినిమాల పరంగా చూస్తే ప్రభాస్ కల్కి 2898 జూన్ లో విడుదల కి సిద్ధం అవుతుంది. మరోవైపు సలార్ 2 సినిమాతో కూడా బిజీగా ఉన్న ప్రభాస్ చేతిలో రాజా సాబ్, స్పిరిట్ సినిమాలు కూడా ఉన్నాయి.


 



 


ఇదీ చదవండి:  ఏపీలో కాబోయే సీఎంపై వెంకన్న సాక్షిగా రేవంత్ హాట్ కామెంట్స్..


ఇదీ చదవండి: తెలంగాణ వాసులకు శుభవార్త.. వచ్చే 5 రోజులు వానలే వానలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook