Prabhas-Sreeleela Movie: టాలీవుడ్ లేటెస్ట్ సన్సెషన్ శ్రీలీల చేతి నిండా సినిమాలతో యమ జోరు మీదుంది. స్టార్ హీరోలందరూతో నటిస్తూ పుల్ జోష్ లో ఉంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో శ్రీలీల చేతిలో దాదాపు అరడజనుకు పైగానే సినిమాలున్నాయి. ఈమె రామ్ తో కలిసి నటించిన స్కంద సినిమా మరో మూడు రోజుల్లో రిలీజ్ కానుంది. మరోవైపు ఈ బ్యూటీ బాలకృష్ణతో భగవంత్‌ కేసరి, మహేశ్ బాబుతో గుంటూరు కారం, పవన్ కల్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్, నితిన్ తో ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్‌, మెగా హీరో వైష్ణవ్ తో ఆది కేశవ సినిమాలు చేస్తుంది. దీంతోపాటు మరో రెండు కన్నడ సినిమాలు కూడా చేస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పుడు ఈ బ్యూటీ లిస్ట్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా చేరినట్లు తెలుస్తోంది. డార్లింగ్ సరసన ధమాకా బ్యూటీ నటించబోతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కొన్ని నెలల కిందట సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడి ప్రభాస్ కు ఓ కథ వినిపించినట్లు ఇన్ సైడ్ టాక్. ప్రపంచ యుద్ధం బ్యాక్‍డ్రాప్‍లో లవ్ స్టోరీగా ఈ మూవీ కథ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రీలీల హీరోయిన్‍గా నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ వార్త కనుక నిజమైతే శ్రీలీల పాన్ ఇండియా హీరోయిన్‍గా ఎదిగే ఛాన్స్ ఉంటుంది. ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన 'సలార్' మూవీ త్వరలో రిలీజ్ కానుంది. 


Also Read: Karna Teaser: వావ్ అనిపించేలా.. విక్రమ్ 'కర్ణ' టీజర్?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook