Pushpa 2 : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. 2021లో విడుదలైన పుష్ప సినిమాకి రెండవ భాగంగా ఈ సినిమా త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. పుష్ప సినిమా తెలుగులో మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక పుష్ప సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో తన అద్భుతమైన నటన కి గానూ అల్లు అర్జున్ ఈ మధ్యనే నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. దీంతో పుష్ప 2 సినిమా రేంజ్ భారీగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుంది అని చిత్ర బృందం కూడా గట్టి నమ్మకంతో ఉంది. సినిమా ఓవరాల్ గా 1000 కోట్ల మార్క్ చేరుతుంది అని కొందరు కామెంట్లు చేస్తున్నారు.


ఈ సినిమా డిజిటల్ రైట్స్, సాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ మాత్రమే 350 కోట్ల బిజినెస్ చేసే లాగా కనిపిస్తోంది. అందులో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే 200 కోట్ల బిజినెస్ ను నిర్మాతలు ఆశిస్తున్నట్లు సమాచారం. పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో పుష్ప 2 సినిమా విషయంలో తమిళనాడు, కేరళ, కర్ణాటకలో కూడా ఎక్కువ బిజినెస్ జరిగే అవకాశాలు లేకపోలేదు. మూడు రాష్ట్రాల నుంచి కలిపి 80 నుంచి 100 కోట్లు బిజినెస్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. అంటే కేవలం సౌత్ ఇండియా నుంచి సినిమాకి 280 నుంచి 300 కోట్ల బిజినెస్ జరుగుతుంది.


ఇక ఓవర్ సీస్ మార్కెట్ విషయంలో కూడా ఈ సినిమాని నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ వారు 100 కోట్ల కి డీల్ క్లోజ్ అయ్యేలాగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కేజిఎఫ్ 2, బాహుబలి 2 వంటి సినిమాలు సౌత్ సినిమాలు బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ లు అయ్యాయి కాబట్టి పుష్ప 2 మీద కూడా బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ లకి భారీ నమ్మకం ఉంది. ఇక సినిమా విడుదలయ్యాక 500 కోట్ల కలెక్షన్లు నమోదు చేసుకున్నా, సినిమా 1000 కోట్ల మార్కు దాటేసినట్టే చెప్పుకోవచ్చు. 


యాక్షన్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పుష్ప 2 లో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే ఎర్ర చందనం స్మగ్లర్ పాత్రలో కనిపించనున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ మలయాళం నటుడు ఫాహాధ్ ఫాసిల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15న థియేటర్లలో విడుదల కాబోతోంది.


Also Read: Bjp-Janasena: తెలంగాణలో కుదిరిన పొత్తు, జనసేనకు 9 సీట్లు, ఓకే చెప్పిన పవన్ కళ్యాణ్


Also Read: Dust Allergy: డస్ట్‌ అలర్జీ బాధిస్తోందా..? అయితే ఈ ఐదు రకాల టిప్స్‌ను ట్రై చేయండి   



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook