Adipurush case : ఆదిపురుష్‌కు దెబ్బ మీద దెబ్బ.. ప్రభాస్, ఓం రౌత్లపై కేసు నమోదు
Case Files Against Adipurush ఆదిపురుష్ సినిమా మీద వరుసగా కేసులు నమోదు అవుతున్నాయి. మనోభావాలు దెబ్బతిన్నాయంటూ హిందూ సంస్థలు ఆదిపురుష్ టీం మీద ఫిర్యాదులు చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా మరో చోట కేసులు నమోదు అయింది.
Adipurush case : ప్రభాస్ ఆదిపురుష్ సినిమా టీజర్ మీద ఎన్నెన్నో ట్రోల్స్, మీమ్స్ వచ్చాయో అందరికీ తెలిసిందే. ఏ ఒక్కరూ కూడా ప్రభాస్ ఆదిపురుష్ టీజర్ మీద సంతృప్తిని వ్యక్తం చేయలేదు. అయితే ఈ మూవీ మొబైల్ యూజర్ల కోసం కాదని, త్రీడీ స్క్రీన్లలో చూడాలని, అప్పుడు తేడా తెలుస్తుందని ఓం రౌత్ అన్నాడు.అయితే కొన్ని చోట్ల త్రీడీ స్క్రీన్లలో ఆదిపురుష్ టీజర్‌ను ప్లే చేసి చూపించారు. మొబైల్లో చూపించిన దానికీ, త్రీడీలో చూసిన దానికి చాలా తేడా ఉందని అన్నారు. అయితే త్రీడీలో చూసినా కూడా గెటప్స్ అయితే మారవు కదా? లుక్స్ మారవు కదా? అని ఇంకొందరు అన్నారు.
రాముడు అలా ఉంటాడా? అలాంటి వస్త్రాలు ధరిస్తాడు?ఆంజనేయుడు తోలు వస్త్రాలు ధరిస్తాడా? రావణుడు అలా ఉంటాడా? అంటూ ఇలా అందరూ ఆదిపురుష్ టీం మీద విరుచుకుపడుతున్నారు. ఆల్రెడీ మధ్య ప్రదేశ్ హోం మినిస్టర్ కూడా మండిపడ్డాడు. వెంటనే ఆ సీన్లను తొలగించమని హెచ్చరించాడు. ఇక ఢిల్లీలో ఆల్రెడీ ఆదిపురుష్ టీం మీద కేసు వేశారు. మళ్లీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని జాన్పూర్ కోర్టులో కేసు నమోదు చేశారు. ఆదిపురుష్ టీం, ప్రభాస్, ఓం రౌత్‌ల మీద కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.
జాన్పూర్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ అశుతోష్ సింగ్ కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. అడ్వకేట్ హిమాన్షు శ్రీవాస్తవ చేసిన ఫిర్యాదు మేరకు ప్రభాస్, ఓం రౌత్, సైఫ్ అలీ ఖాన్ ఇలా అందరి మీద కేసు నమోదు చేశారని తెలుస్తోంది. అక్టోబర్ 27న విచారణ జరపనున్నట్టు తెలుస్తోంది. సీతారాములు, హనుమాన్, రావణుడిని చూపించిన తీరుతో మనోభావాలు దెబ్బ తిన్నాయంటూ చెప్పుకొచ్చాడు.
అలా అదిపురుష్ టీం మీద రోజూ ఎక్కడోచోట.. ఏదో ఒక వివాదం రాజుకుంటూనే ఉంది. అయితే ఆదిపురుష్ టీం మాత్రం పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. వీఎఫ్‌ఎక్స్ కూడా మొత్తం మార్చబోతోన్నట్టు కనిపిస్తోంది. అయితే ఆదిపురుష్ మీద మాత్రం ఇప్పుడు పూర్తి నెగెటివ్ టాక్‌తోనే సతమతమవుతోంది. మరి రిలీజ్ టైంకు ఆదిపురుష్ టాక్ ఎలా ఉంటుందో చూడాలి.
Also Read : Galata Geetu : భయంకరమైన అతి.. గీతూ ఓవర్ యాక్షన్
Also Read : God Father - Pawan Kalyan: ఆ పాత్రలో పవన్ కల్యాణ్ నటిస్తే బాగుండేది: చిరంజీవి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook