Bigg Boss Geetu : బిగ్ బాస్ ఇంట్లో ప్రస్తుతం బ్యాటరీ చార్జ్ గురించి టాస్క్ జరుగుతోంది. బిగ్ బాస్ సమయానుసారం ఒక్కో కంటెస్టెంట్‌ను పిలుస్తున్నాడు. ఒక్కొక్కరికి మూడు మూడు ఆప్షన్లు ఇచ్చేశాడు. ఒక్కో ఆప్షన్‌కు ఒక్కో రకమైన చార్జింగ్ శాతం ఉంటుంది. ఆడియో కాల్, ఆడియో మెసెజ్, వీడియో కాల్, వీడియో మెసెజ్, ఫుడ్, ఫోటోలు ఇలా ఒక్కో ఎమోషన్ మీద బిగ్ బాస్ ఆప్షన్స్ ఇచ్చాడు. అయితే బ్యాటరీలో చార్జింగ్ అయిపోయినప్పుడు ఒక్కో టాస్క్ ఇచ్చి.. మళ్లీ దాన్ని ఫుల్ చేసేందుకు ట్రై చేస్తాడు. బిగ్ బాస్ ఇంటి సభ్యులు రూల్స్ పాటించకపోయినా బ్యాటరీ చార్జింగ్ తగ్గిపోతుంది.
అలా రేవంత్ రెండు సార్లు నిద్రపోవడం వల్ల పది శాతం చార్జింగ్ తగ్గింది. ఇక నిన్న రీచార్జ్ చేసే పనిలో భాగంగా గీతూని లోపలకు పిలిచాడు బిగ్ బాస్. ఇంట్లోని వాళ్లంతా చక్కర త్యాగం చేయాలని లేదా బాలాదిత్యతో సిగరెట్లు మాన్పించాలనే టాస్క్ ఇచ్చాడు గీతూకి. చక్కర త్యాగం చేస్తే 70 శాతం, బాలాదిత్య సిగరెట్లు మానేస్తే 90 శాతం చార్జింగ్ అవుతుందని తెలిపాడు. దీంతో బాలాదిత్యతో సిగరెట్లు మాన్పిస్తాను అని చెప్పింది.
Ee #Geetu overaction konchem over avutondi.. sodhi laa vundi!!🤭#BiggBoss6Telugu #biggbosstelugu6 @iamnagarjuna
— 🅱️eing 🅾️ptimistic🎩🐦 (@MaruthiChikka) October 12, 2022
బయటకు వచ్చిన గీతూ మాత్రం దాన్ని తిప్పి చెప్పింది. ఇంట్లో వాళ్లంతా ఫుడ్ మానేయాలి.. అంటే.. ఇంట్లో ఉన్న ఉప్పు కారం చెక్కర ఇలా అంతా ఇచ్చేయాలి.. లేదంటే బాలాదిత్యతో సీజన్ అంతా సిగరెట్లు మాన్పించాలి అని చెప్పింది. ఆ తరువాత సీజన్ అంతా అని తనతో చెప్పలేదని మాట మార్చింది. అయితే ఆదిరెడ్డికి మాత్రం అసలు విషయం చెప్పింది. ఇంట్లో రేషన్ అంతా కాదు.. కేవలం చక్కర మాత్రమే అని అన్నారు. కానీ నేను అలా చెప్పానంటూ గీతూ అనేసింది.
#biggbosstelugu6 ee #geetu toseyandi ehe deni pilli muthi deni barre gonthu….. 🤮🤮🤮 pic.twitter.com/HoGJ2npyXa
— Krish (@krishtolly) October 12, 2022
దీంతో ఆది రెడ్డి హర్ట్ అయ్యాడు.అలా ఎందుకు చేశావ్ అక్కా.. అది తప్పు కదా?.. సిగరెట్ లేకపోతే ఆయనకు కష్టం అని ఆదిరెడ్డి అంటాడు. సిగరెట్ ఆరోగ్యానికి హాని కరం కదా? అందుకే అలా చేశానంటూ ఎక్స్ ట్రా చేసింది గీతూ. ఇక గీతూ తన తండ్రితో ఆడియో కాల్ మాట్లాడుకునేందుకు చాన్స్ తీసుకుంది. కానీ తండ్రి చెప్పిన మాటలు మాత్రం వినలేదు. ఈమె అతే చూపించింది.
కొన్ని మార్చుకోవాలి.. ఇంట్లో అందరితో బాగా ఉండూ.. రివ్యూలు చేయకు.. ఎవ్వరికీ చెప్పకు.. కొన్ని మార్చుకుంటే బాగుంటుంది.. ఇప్పుడు అయితే టాప్ 5లో ఉంటావ్.. మార్చుకుంటే నీకే మంచిది అని ఇలా తనతండ్రి చెప్పిన మాటలను గీతూ పట్టించుకోలేదు. తన దారేదో తానే అన్నట్టుగా ఓవర్ యాక్షన్ చేసింది. ఫోన్ బూత్‌లోంచి బయటకు వస్తున్నప్పుడు కూడా పిల్ల చేష్టల్లా చేసింది గీతూ. ఈ ఓవర్ యాక్షన్‌ను జనాలు భరించలేకపోతోన్నారు.
Also Read : మరో వివాదంలో ఆమీర్ ఖాన్.. హిందూ సంప్రదాయాలు మార్చేస్తున్నారంటూ ఫైర్!
Also Read : Mohan Babu Repeating Mistake: చిరంజీవి చేసిన తప్పే రిపీట్ చేస్తున్న మోహన్ బాబు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook