Oh My God-2 Movie Update: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar) దేవుడిగా చేస్తున్న మూవీ 'ఓ మై గాడ్-2' (Oh My God 2 Movie). ఈ చిత్రంలో యామీ గౌతమీ, పంకజ్ త్రిపాఠి కీలకపాత్రల్లో నటిస్తున్నారు. అమిత్‌ రాయ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తొమ్మిదేళ్ల క్రితం వచ్చిన 'ఓ మై గాడ్‌' సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. వాకావ్ ఫిలింస్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమా ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే తాజాగా ఈ మూవీకి ఏ సర్టిఫికేట్‌ ఇచ్చింది సెన్సార్ బోర్డు. ఇప్పుడు ఇది హాట్ టాఫిక్ గా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధారణంగా దేవుడి నేపథ్యంలో వచ్చే చిత్రాలకు క్లీన్‌ యూ సర్టిఫికేట్‌ లేదా యూ/ఏ సర్టిఫికేట్‌ ఇవ్వడమో చూస్తాం. కానీ ఈ సినిమాకు ఏ సర్టిఫికేట్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురించి చేసింది.  ఒక దేవుడు సినిమాకు 'ఏ' సర్టిఫికేట్‌ ఇదే తొలిసారిమో. అంతలా అడల్ట్ కంటెంట్ ఏముందని సినీ విశ్లేషకులు ఆలోచిస్తున్నారు. ముందుగా ఈ మూవీ చూసిన సెన్సార్‌ బోర్డ్‌ సభ్యులు చిత్రయూనిట్‌కు ఏకంగా 20 కట్స్‌ను రికమెండ్ చేశారు. దీనికి ఒప్పుకోని నేపథ్యంలో సర్టిఫికేట్‌ను ఇస్తామని నిర్మాతలకు సెన్సార్‌ బోర్డు ముందే చెప్పిందట. అయితే మూవీ మేకర్స్ ఆ కట్స్ కు నిరాకరించడంతో ఏ సర్టిఫికేట్ జారీ చేసిందట. ఈ సినిమా రన్‌టైమ్‌ 2గంటల 36 నిమిషాలు ఉండనున్నట్లు మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రంలో అమిత్‌రాయ్‌ కొన్ని కంట్రవర్సీ అంశాలను టచ్ చేసినట్లు బీ టౌన్ వర్గాల టాక్. 


Also Read: August Releases: ఆగస్టులో అదిరిపోయే ఎంటర్‌టైన్‌మెంట్.. సూపర్ స్టార్ తో పోటీపడుతున్న మెగా హీరోలు..!


ప్రస్తుతం అక్షయ్ కుమార్ ఆశలన్నీ ఈ సినిమాపైనే ఉన్నాయి. గత ఏడాది ఈ హీరో చేసిన అన్నీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. ఇందులో సామ్రాట్ పృథ్విరాజ్, రక్షా బంధన్, బచ్చన్ పాండే, రామ్ సేతు, సెల్పీ వంటి సినిమాలు ఉన్నాయి. 


Also Read: HBD Mrunal Thakur: నాని 'హాయ్‌ నాన్న' నుంచి మృణాల్ ఫస్ట్ లుక్ అదిరింది..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook