Chaavu Kaburu Challaga Movie Set To Release On March 19: ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో కార్తికేయ. భారీ ప్రాజెక్టు మూవీస్‌తో తన లక్ పరీక్షించుకుంటూ వస్తోంది నటి లావణ్య త్రిపాఠి. వీరిద్దరి క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న లేటెస్ట్ సినిమా ‘చావు కబురు చల్లగా’. బన్నీ వాసు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించి ఈ మూవీని తెరకెక్కించారు. డైరెక్షన్ చేయడంతో పాటు సినిమాకు తన స్క్రిప్ట్ వర్క్ అందించాడు. బస్తీ బాలరాజుగా హీరో కార్తికేయ మరో మాస్ క్యారెక్టర్‌లో దుమ్మురేపేందుకు సిద్ధమయ్యాడు. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల చావు కబురు చల్లగా మూవీ(Chaavu Kaburu Challaga Movie) నుంచి ఫిక్సయిపో వీడియో సాంగ్ రిలీజ్ చేయగా మంచి స్పందన లభించింది.


Also Read: Chaavu Kaburu Challaga: నిన్ను అలా పడుకోబెడితే, నీకు కూడా సిస్టర్‌నే!



నిన్న ఆదిత్య మ్యూజిక్ ‘చావు కబురు చల్లగా’ మూవీ సాంగ్ జూక్ బాక్స్ రిలీజ్ చేసింది. మార్చి 19న ఈ సినిమా థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. టీజర్, ట్రైలర్లతో పాటు పాటలు సైతం టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్ ఈవెంట్లతో బస్తీ బాలరాజు కార్తికేయ బిజీబిజీగా ఉన్నాడు. లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi)  ఎక్కడుంతో తెలియదుగానీ సీకేసీ రిలీజ్ టూర్ అంటూ కార్తికేయ మాత్రం సందడి చేస్తున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు టాలీవుడ్ ప్రముఖ పీఆర్వో బీఏ రాజు ఈ మూవీ సాంగ్స్ జూక్ బాక్స్‌ లింక్ షేర్ చేసుకున్నారు.


Also Read: Fix Ayipo Video Song: Chaavu Kaburu Challaga నుంచి ‘ఫిక్స్ అయిపో’ మరో మాస్ సాంగ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook