Fix Ayipo Video Song: Chaavu Kaburu Challaga నుంచి ‘ఫిక్స్ అయిపో’ మరో మాస్ సాంగ్

Fix Ayipo Full Video Song : చావు కబురు చల్లగా సినిమాకు సంబంధించి ఓ అప్‌డేట్ వచ్చింది. మరోవైపు పోస్ట్ ప్రొడక్ష్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘చావు కబురు చల్లగా’. 

Written by - Shankar Dukanam | Last Updated : Mar 11, 2021, 11:54 AM IST
  • ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా మూవీ
  • చావు కబురు చల్లగా మూవీ నుంచి ఫిక్స్ అయిపో వీడియో సాంగ్ విడుదల చేసిన మూవీ యూనిట్
  • క్రేజీ కాంబినేషన్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న టాలీవుడ్ ఫ్యాన్స్
Fix Ayipo Video Song: Chaavu Kaburu Challaga నుంచి ‘ఫిక్స్ అయిపో’ మరో మాస్ సాంగ్

Fix Ayipo Video Song From Chaavu Kaburu Challaga: ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘చావు కబురు చల్లగా’. కౌశిక్ పెగళ్లపాటి స్క్రిప్ట్ వర్క్ చేయడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నాడు. చావు కబురు చల్లగా సినిమాకు సంబంధించి ఓ అప్‌డేట్ వచ్చింది. మరోవైపు పోస్ట్ ప్రొడక్ష్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

ఇటీవల విడుదలైన ‘చావు కబురు చల్లగా..’ (Chaavu Kaburu Challaga) మూవీ టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసేంది. ఈ క్రమంలో మూవీ యూనిట్ మహా శివరాత్రి సందర్భంగా తాజాగా ‘హే.. ఓరకత్తితో అలా చూస్తావే.. బుర్ర వేడేక్కిపోయేలా..’ (Fix Ayipo Video Song) వీడియో సాంగ్ రిలీజ్ చేసింది. డైరెక్టర్ కౌశిక్ పెగళ్లపాటి, సనరే సాహిత్యం అందించిన ఈ పాటను బిగ్ బాస్ 3 విజేత, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, ఆదిత్య గాత్రం అందించారు. జేక్స్ బేజోయ్ స్వరాలు సమకూర్చిన ఈ వీడియో సాంగ్‌ను మీరూ వీక్షించండి.

Also Read: Mehreen Pirzada Kaur engagement: మెహ్రీన్ పిర్జాదా కౌర్ ఎంగేజ్‌మెంట్‌కి సర్వం సిద్ధం

ఇటీవల విడుదలైన చావు కబురు చల్లగా సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన వచ్చింది. ఆ తరువాత టీజర్‌లో లావణ్య త్రిపాఠి, కార్తికేయ మధ్య డైలాగ్స్ సైతం మాస్ ఆడియెన్స్‌కు చేరువయ్యాయి. వేసవిలో మూవీ విడుదల చేయాలని సినిమా యూనిట్ ప్లాన్ చేస్తోంది. బన్నీ వాసు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Also Read: Shilpa Shetty: ఎవర్ గ్రీన్ గ్లామరస్ క్వీన్ శిల్పా శెట్టి లేటెస్ట్ లుక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News